పిల్లలు కనండి.. చైనాలో కొత్త సమస్య?

చైనాలో ఇది వరకు ఒక్కరిని మాత్రమే కనాలని రూల్ ఉండేది. చైనా ప్రజలు ఇద్దరు పిల్లల్ని కనాలన్నా కోరిక ఉన్నా చంపేసుకుని ఒక్కరిని మాత్రమే కనేవారు. ఇద్దరు కావాలని కోరిక ఉన్నా ప్రభుత్వం ఒప్పుకునేది కాదు. అక్కడ వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి.. యువత తగ్గిపోతున్నారని గమనించిన చైనా ఇప్పుడు కొత్త పంథా మార్చి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనడానికి అనుమతి ఇచ్చింది.

దీని కోసం రాయితీలు కూడా ప్రకటిస్తోంది. అయితే ఒక్కరిని కని వారినే అల్లారు ముద్దుగా చూసుకునే వారు. ఆ ఒక్క అమ్మాయి లేదా అబ్బాయిని అపురూపంగా చూసుకునే వారు. ఇలాంటి సమయంలో వారికి సంబంధించి 5 సంవత్సరాల వరకు బేబీ పౌడర్స్, ఆయిల్, డైపర్స్ ఇలా అనేక ప్రొడక్టులను కొనే వారు. దీంతో ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం పంథా మార్చి ముగ్గురిని కనాలని చెప్పింది.

ఇన్ని రోజులు ఒక్కరిని కనడానికి అలవాటు పడ్డ చైనీయులు దాని నుంచి అంత ఈ జీగా బయటకు రాలేక పోతున్నారు. ఎందుకంటే ఒక్కరిని పోషించడానికే ఎంతో కష్టపడిన వైనం. ఇప్పుడు ఇద్దరినీ కని పోషించే స్థాయి శక్తి లేవని చెబుతున్నారు. మరి బేబీ ప్రొడక్టుల రంగం ఎలా సంక్షోభం లోకి వెళ్లిపోతుందంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. గతంలో ఒక్కరి కోసమే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడేవారు. దాని కోసం ఎంతో కష్టపడేవారు.

చైనా మహిళలు ఒక్కరి కన్నా కూడా వారిని చూసుకోవాలంటే ఉద్యోగం వదిలి చూసుకోవాలి. దీంతో ఇటు ఉద్యోగం వదులుకోలేక పిల్లల్ని కనడం ఇష్టం లేక సంతానం వద్దనుకుంటున్న పరిస్థితి.. అయితే చైనా ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు ఒక సూచన చేసింది. ఇంత వరకు చిన్న పిల్లల ప్రొడక్టులు ఉత్పత్తి చేశారు. ఇప్పటి నుంచి పెద్ద వారికి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేయాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: