యుద్ధం ఆపాలంటే.. సూపర్ కండిషన్ పెట్టిన రష్యా?
రష్యా విదేశాంగ మంత్రి సెర్గోస్ లావోస్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్, చైనా ఇతర కొన్ని దేశాలు శాంతి కావాలని కోరకుంటున్నాయి. నిజమే దానికి మాకు సమ్మతమే. కానీ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. గతంలో అతిపెద్ద దేశంగా ఉన్న యూఎస్ ఎస్ ఆర్ ఏ దేశానికి హానీ తలపెట్టలేదు. కానీ దాన్ని ముక్కలు చేయడంలో ఆనాడు అమెరికా ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్ యుద్ధంలో తానే ముందుండి నడిపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదు.
ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని చలాయించాలనుకోవడం సరైనది కాదు. అమెరికా కూడా వెనక్కి తగ్గితేనే దీనికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే అమెరికా ఏ విధంగాను ఒప్పుకొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రష్యా అమెరికా, మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది.
ఇక ఆధిపత్య పోరు కొనసాగేలా ఉంది. అమెరికా అగ్రరాజ్య ఆధిపత్య పోకడను తగ్గించేందుకే రష్యా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏ విషయంలోనైనా అమెరికా తల దూర్చడం ఏమిటి అది సరైనది కాదు కదా.. ఏదైమైనా యుద్ధాన్ని ఆపాలని చేస్తున్న ప్రయత్నం హర్షించదగినది. కానీ ఈ చర్చలు విజయవంతం అవుతాయా? లేక ఇలాగే కొనసాగి ప్రపంచంలో అణు విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందా.. త్వరలోనే తేలనుంది.