బాబునే నమ్ముకున్న అమరావతి రియల్ ఎస్టేట్?
కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవంతులను కట్టారు. కానీ జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల ప్రపోజల్ తీసుకురావడంతో ఒక్క సారిగా అమరావతి, గుంటూరులో భూముల, ప్లాట్ల రేట్లు పడిపోయాయి. దీంతో ఏమీ చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిల బడిపోయింది. ఇప్పుడు కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి చంద్రబాబు టీడీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే అమరావతి డెవలప్ మెంట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలని రియల్టర్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క చోట ఉంటే భూములు, ఇతర అన్ని రంగాలు తొందరగా రేట్లు పెరుగుతాయి. ఆ ప్రాంతం రాజధాని అయ్యే సమయంలో ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. ఎంతో మందికి ఉపాధి దొరకుతుంది. కొత్త కొత్త కంపెనీలు వస్తాయి. వాటి వల్ల యువతకు ఉద్యోగాలు దొరకుతాయి. ఇలా ఎందరికో లాభం కలుగుతుంది. ఒక ప్రాంతం లో డెవలప్ చేయడం వల్ల దానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బాబుని ప్రస్తుతం రియల్టర్లు నమ్ముతున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో బాబు గెలిస్తే వారు అనుకున్నది సాధించేందుకు తోడ్పాటు అందిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు.