రష్యా కీలక నిర్ణయం..ప్రపంచానికి పెనుముప్పు?

అమెరికా, రష్యా మధ్య గతంలో అణు నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఐక్యరాజ్య  సమితి మధ్యవర్తిగా ఉండి ఈ ఒప్పందం చేయించింది. క్రమంగా అణు ఆయుధాలను తగ్గించుకోవాలి. మొదటి దశలో ప్రతి ఏడాది ఎవరి దగ్గర ఎన్ని అణ్వయుధాలు ఉన్నాయో వాటిని దశల వారీగా నిర్వీర్యం చేసేందుకు రెండు దేశాలు ఒప్పుకున్నాయి.  మొదట్లో ఈ కార్యక్రమం బాగానే జరిగింది.

ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా ఉక్రెయిన్ కు అండగా నిలబడుతున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో రష్యా అణ్వస్త్ర ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం కొత్త అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. పాత వాటిని మెల్లిగా నిర్వీర్యం చేసేయాలి. ఇప్పడు అణు నిరాయుధీకరణ నుంచి రష్యా తప్పుకోవడం సంచలనంగా మారింది.

అణ్వస్త్రాలను, వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే యుద్ధ నౌకలను సరికొత్తగా తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా తన దగ్గర ఉండే అణు సామర్థ్యాలు, అణ్వస్త్ర  సామర్థ్యం కలిగిన బాంబులు, మిస్సైల్ టెస్టులు చేసే విషయాన్ని కూడా అమెరికా తో ఇకపై పంచుకోమని ప్రకటించింది. దీంతో అమెరికా, రష్యాల మధ్య ఉన్న అణు నిరాయుధీకరణ ఒప్పందం పూర్తిగా పక్కకు వెళ్లిపోయినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ ఒప్పందం మూలంగా అణు దాడులు చేసేందుకు రష్యా వెనకాడిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు పుతిన్ తీసుకోబోయే నిర్ణయాలు మరింత కఠినంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.  

దీనికంతటికి కారణం ఉక్రెయిన్ కు అమెరికా యుద్ధంలో సాయం చేస్తుండటమే. దీని వల్ల ఆగ్రహం చెందిన రష్యా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.  రాబోయే రోజుల్లో రష్యా ఆగ్రహానికి ముందు ఉక్రెయిన్ బలయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆయా దేశాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.  అణు నిరాయుధీకరణ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: