పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?

తెలుగు సినీ నటుడు ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత సినిమాల పై శ్రద్ధ చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. పవన్ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాడని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం అది నిజం కాదు అని అంటున్నారు. హరి రామ జోగయ్య లాంటి వాళ్ళ వ్యాఖ్యల ద్వారా ఈ విషయం  కొంత వరకు అర్థమవుతుంది.

ఈ వ్యాఖ్యల తర్వాత హరి రామ జోగయ్య గారి మీద ఒక ముద్ర అయితే వేసారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి జనసేన అధికారంలో రావాలని జనసేన కార్యకర్త అన్నా, అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రే అన్నట్టుగా ఉంటుంది. ఒక క్వశ్చన్ మార్క్ వేసి జనాల్లో ఆసక్తిని పెంచడానికి ఆ విధంగా రాసేస్తుంటారు.

పవన్ కళ్యాణ్ ఏ మాట అన్నా, ఏం స్టేట్మెంట్ ఇచ్చిన డైరెక్ట్ గా వాళ్ళ సంస్థ నుండి ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అనని మాటలను కూడా అన్నట్టుగా రాసేసి చివరికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారంట అని ఒక తప్పుడు సంకేతం ఇచ్చేస్తారు. పవన్ సీఎం కావాలనుకున్నా, అది వైసిపి మనుషులే లేదా పవన్ సగం సీట్లు 20 సీట్లు కావాలన్నా అది కూడా వైసిపి మనుషులే. అదే జనసేన ఇచ్చిన 20 సీట్లు తీసుకుని కూర్చుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ మనుషులు అవుతారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని,   జనసేన పార్టీ కార్యదర్శి హరి ప్రసాద్ పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పారని, రాజకీయ వ్యూహాల గురించి పార్టీ శ్రేణులు ఎవరు భయపడద్దని, వైకాపా మైండ్ గేమ్ గురించి ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో జనసేన పై తప్పుడు ప్రచారాలను చేయడం మైండ్ గేమ్ లో భాగం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: