ఆ దేశాలను డబ్బుతో కొనేస్తున్న చైనా?

తైవాన్ కి వ్యతిరేకంగా, దేశాలన్నిటినీ తనవైపు తిప్పేసుకుంటుంది చైనా. భారతదేశంలో అయితే మోడీకి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోరోస్ తో పాటు, చైనా కూడా డబ్బులు ఇచ్చి ఇక్కడ కొన్ని సంఘాలను నడుపుతున్నట్లు సమాచారం. వాళ్ళందరూ ఇక్కడ ప్రభుత్వం బాలేదు అంటూ భారీ ఉపన్యాసాలతో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. అలా వీళ్ళు మాట్లాడే నెగిటివ్ మాటలకు అమెరికా నుండి సోరోస్ సంస్థ వంత పాడుతూ హైలెట్ చేస్తుందని తెలుస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్న ఎత్తుగడ.

తైవాన్ కి అనుకూలంగా ఉండే లాటిన్ అమెరికాలో భాగమైనటువంటి హోండూరస్ ఇప్పుడు తైవాన్ తో తెగతెంపులు చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు చైనాతో అనుబంధం కొనసాగిస్తున్న హోండూరస్ వన్ చైనా పాలసీని సమర్థించడం ద్వారా  చైనాకు అనుకూలంగా మారిపోయింది. దాన్ని చెక్ బుక్ డిప్లమసీ అంటారు. చైనా అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టడంతో వాళ్ళు చైనా వైపుగా తిరిగిన పరిస్థితి అక్కడ.

తైవాన్ మిత్ర ద్వీపాలందర్నీ కూడా ఈ దౌత్య మార్గంలో, ఆర్థిక మార్గంలో తన వైపుకు లాక్కుంటుంది చైనా. ఎల్ సాల్విడార్ 2018లో చైనా దగ్గర 2.8మిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది.  అట్లాగే పనామా కెనాల్ ఫ్రీ కి సంబంధించిన నిర్ణయం ద్వారా మరో దేశం చైనాకు తోడైనట్టైంది. గాంబియా 2013లో చైనా దగ్గర నిధులు తీసుకున్నాక తైవాన్ ను పక్కనపెట్టి, చైనాతో సహవాసం చేస్తుంది.

అలాగే సాల్మన్ ఐలాండ్ 2018లో డెవలప్మెంట్ అసిస్టెన్స్ తీసుకుని, చైనా తైవాన్ వేరు కాదు, తైవాన్ చైనాలో భాగమే అని ప్రకటించింది. అలాగే చైనా తన దగ్గర ఉన్న 150మిలియన్ టూరిస్టులను తనతో మిత్రులుగా ఉండే దేశాలకు పంపిస్తామని చెప్పడం ద్వారా, డబ్బులు ఇవ్వడం ద్వారా, ఆయా దేశాల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా వాళ్లందర్నీ తన వైపుకి లాక్కుంటుంది చైనా. తైవాన్ ని ఒక దేశంగా గుర్తించే 18దేశాలలో 5దేశాలను తన వైపుకు తిప్పేసుకుంది చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: