ఇంటికి రూ. లక్ష.. పవన్‌ సంచలన సాయం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారిని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఒక్కో బాధితుడికి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. త్వరలోనే రూ. లక్ష చొప్పున బాధితులకు పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేయనున్నారు.

ఈ విషయాన్ని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో వివరించారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి జనసేన అండగా నిలవాలని నిర్ణయించింది. వారికి ఆర్ధికంగా అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ అందులో పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని నాదెండ్ల మనోహర్  తెలిపారు. అందుకు కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మనోహర్ అభిప్రాయపడ్డారు.

జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరించి, ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయించారని నాదెండ్ల మనోహర్  ఆరోపించారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని నాదెండ్ల మనోహర్  అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారని నాదెండ్ల మనోహర్  తెలిపారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటం వాసుల గుండె నిబ్బరాన్ని చూసి పవన్ కల్యాణ్‌ చలించిపోయారని నాదెండ్ల మనోహర్  తెలిపారు.

అందుకే కేవలం  నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల సాయం ప్రకటించినట్లు నాదెండ్ల మనోహర్  వివరించారు. ఈ లక్ష రూపాయల మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్  స్వయంగా బాధితులకు అందచేస్తారని నాదెండ్ల మనోహర్  చెప్పారు. కేవలం మాటలు చెప్పడం, ఫోటోలు దిగడం, మీడియా కవరేజ్‌ కోసం ప్రయత్నించడమే కాకుండా.. ఇలా నిజంగా సాయం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆ సాయం త్వరగా వారికి అందిస్తే జనసేనకు మంచి పేరు దక్కుతుందడనంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: