NTV ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు?

తెలుగు న్యూస్ ఛానెళ్లలో టాప్ ప్లేసులో ఉన్న నంబర్ వన్ న్యూస్ ఛానెల్ NTV ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచేసింది. జీతాలే ఇవ్వలేని కొన్ని మీడియా సంస్థలను ఇటీవల చూస్తున్నాం. కొన్ని సంస్థలు పెంచినా అరకొర చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటున్నాయి. అలాంటిది ఎన్టీవీ మాత్రం ఈసారి భారీగానే జీతాలు పెంచిందని ఉద్యోగులు చెబుతున్నారు.

ఎన్టీవీ మాతృ సంస్థ అయిన రచన టెలివిజన్ ప్రైవేట్ కంపెనీలో రెండు రాష్ట్రాల్లో 500 మందికి పైగా పని చేస్తున్నారు. ఏ ఒక్కర్ని కూడా విడవకుండా.. అందరికీ జీతాల పెంపు ఫార్ములా అమలు చేశారు. ఆఫీస్ బాయ్ నుంచి...సీఈవో వరకూ అందరి జీతాలు భారీగానే పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు. NTV, భక్తి టివీలు 15 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 16 వ ఏట అడుగు పెడుతున్న సమయాన్ని పురస్కరించుకుని యాజమాన్యం జీతాల పెంపుకు సరైన సమయంగా భావించినట్టుంది.

జీతాల పెంపు ఎలా ఉందంటే.. 30 వేల వరకు జీతాలు తీసుకుంటున్న వారందరికి  అదనంగా 30 శాతం పెంచారు. అంటే జూలై వరకు 30 వేలు జీతం తీసుకున్న ఉద్యోగి.. ఆగస్టు లో 39 వేలు తీసుకున్నాడన్నమాట. 30 వేల నుంచి 50 వేల లోపు జీతాలు తీసుకుంటున్న వారికి 20 శాతం మేర పెంచేశారు. ఇప్పటి వరకు 40 వేలు తీసుకునే ఉద్యోగి ఇకపై  48 వేలు డ్రా చేస్తాడన్నమాట. 50 వేలు.. ఆ పైన జీతాలు తీసుకుంటున్న వారికి 10 శాతం చొప్పున పెంచారట. సంస్థలో  కొత్తగా చేరిన వారికి కూడా జీతాలు పెంచారని చెబుతున్నతారు.

సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్క నెల కూడా ఉద్యోగుల వేతనాలు ఆలస్యం కాలేదని యాజమాన్యం చెబుతోంది. ప్రతి నెలా 30 తేదీ ముందే ఉద్యోగుల అకౌంట్స్ లో జీతాలు వేస్తున్నామంటోంది. బ్యాంకు కు సెలవులు ఉంటే... 28, 29 తేదీల్లోనే వేతనాలు ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయంటోంది. కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయిన సమయంలోనూ వేతనాలు తగ్గించలేదని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ntv

సంబంధిత వార్తలు: