ప్రపంచానికి వెరీ బ్యాడ్ న్యూస్.. ఆరు రెట్లు మరణాలు?
ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ఇటీవల ఈ నివేదక వివరాలు వెల్లడించారు. రాత్రి సమయాల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయట. దీనివల్ల ప్రజల సాధారణ నిద్రకు భంగం వాటిల్లుతుందట. అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దీని కారణంగా ప్రజల నిద్ర తగ్గుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
ఈ ఒక్క పరిణామం వల్ల ప్రజల ఆరోగ్యంపై పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. దీని కారణంగానే మరణాల రేటు కూడా గణనీయంగా పెరుగుతుంది. తూర్పు ఆసియా దేశాలు చైనా, దక్షిణకొరియా, జపాన్‌లోని 28 నగరాల్లో ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందట. ఎంతగా అంటే ఇక్కడ సరాసరి రాత్రి ఉష్ణోగ్రతలు 2090 నాటికి డబుల్ అవుతాయట. అంటే ఏకంగా 20.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 39.7 డిగ్రీల సెల్సియస్‌కు రాత్రి ఉష్ణోగ్రతలు చేరతాయట.
ఈ అధ్యయన ఫలితాలపై ఇప్పుడు సైంటిస్టుల్లో చర్చ జరుగుతోంది. ఒక్క పరిణామం కారణంగా అనేక దుష్ప్రభావాలు తలెత్తుతుంటాయి. దీన్ని అరికట్టాలంటే భూతాపం తగ్గించాలి. ఇందుకు ప్రంపచ దేశాలన్నీ నడుంబిగించాలి. గతంలో గ్లోబల్ వార్మింగ్‌పై అనేక ప్రపంచ సదస్సులు జరిగాయి. కొన్ని ప్రమాణాలు కూడా నిర్దేశించుకున్నారు. కానీ.. వాటిని సరిగ్గా అమలు చేయించడంలో ప్రపంచ సంస్థలు విఫలం అవుతున్నాయి. ఈ ఆపద నుంచి ముందు తరాలను కాపాడాలంటే పర్యావరణ పరిరక్షణే పరిష్కారం.