బాబోయ్.. జగన్.. కాపాడు.. చచ్చిపోతున్నాం?
చాలా గ్రామాల్లో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్రకటిత కోతలతో గ్రామాల్లో ప్రజలు ఇళ్ళలో ఉండలేక, ఎండ తీవ్రతకు బైటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం సమయంలోనూ, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ఏ సమయమైనా సరే.. ఎప్పుడు కరెంట్ పోతుందో చెప్పలేం.. ఈ విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉదయం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇళ్లలో అన్ని పనులు ఆగిపోతున్నాయి. ఏదోలా ఆ పని కానిచ్చేస్తే..మధ్యాహ్నం ఇళ్ళలో ఫ్యాన్లు తిరగక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక కూలీ నాలి చేసి రాత్రి ఇళ్ళకు వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. మాంచి నిద్ర సమయంలో ఫ్యాన్లు ఆగిపోతే.. ఇక ఆ ఇంట్లో వేడి వాతావరణంలో నిద్రపోలేని దుస్థితి దారుణంగా ఉంది.
ఫ్యాన్ ఉంటేనే ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ఇక కరెంట్ కూడా లేకపోతే రాత్రి చుక్కలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కరెంట్ కోతల సమస్యలపై టీడీపీ యుద్దం ప్రారభించింది. ఫ్యాన్‌కు ఓటేస్తే ఫ్యాన్ కూడా వేసుకోలని పరిస్థితి జగన్ తెచ్చాడని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. విసన్న కర్రలు పంచుతూ నిరసనలు చేస్తున్నారు. సాధారణంగానే వేసవిలో విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఇప్పటికైనా జగన్ ఈ సమస్యపై దృష్టి సారించాలి..లేకపోతే జనానికి ఎక్కడో కాలుతుంది.. దాని ప్రభావం వచ్చే ఎన్నికలపైనా ఉంటుంది.