బియ్యం గొడవ: కేసీఆర్‌కు కేంద్రం భలే షాక్ ఇచ్చిందిగా?

తెలంగాణలో పండే బియ్యం మొత్తం కొనాల్సిందే అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ విషయంపై గట్టిగా మాట్లాడుతున్నరు. పంజాబ్‌ లో పండే మొత్తం వరి పంట కొన్నప్పుడు తెలంగాణ పంట ఎందుకు కొనరని లా పాయింట్ లాగుతున్నారు. అసలే బీజేపీతో టీఆర్‌ఎస్‌ కొన్ని నెలలుగా సంబంధాలు బాగా లేవు.. శత్రువుల్లా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి సమయంలో కేసీఆర్ వరిపోరాటాన్ని రాజకీయ అంశంగా మలచుకున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం కూడా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఊరికే కేసీఆర్‌ తో అనిపించుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో.. లేకుంటే.. రాజకీయంగా ఇబ్బంది పడుతున్నామనుకున్నారో ఏమో.. తెలియదు కానీ.. తెలంగాణలో పండే రా రైస్ మొత్తం కొంటామని ప్రకటించింది. రైతులను ఆదుకోవడం మా బాధ్యత అని.. కానీ.. అందుకు తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదని ఎదురు దాడికి దిగుతోంది.

రా బియ్యం దేశమంతా ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయమంటూ ఎదురు దాడి చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా గతంలోనే  సమాధానం ఇచ్చానన్న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్... రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరలేపారని అంటున్నారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన ద్వారా మరింత స్ఫష్టత ఇచ్చారు.

యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని స్పష్టంగా  ప్రకటించడంతో విషయంలో క్లారిటీ వచ్చేసింది. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యత అంటున్న పీయూష్ గోయల్... దురదష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏమంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: