వైసీపీలో ఇంత పెద్ద హడావిడా... అందరిలోనూ ఒక్కటే టెన్షన్..!
మరోవైపు.. ఎన్నికై.. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే .. తాము ఇచ్చిన హామీలను ప్రజలు నిలదీస్తారనే భయం నాయకుల్లో కనిపిస్తోంది. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజల్లోనే ఉండాలంటూ.. ఎమ్మెల్యేలను రోజుకోసారి చెబుతోంది. వెళ్లకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. దీంతో నాయకులు.. తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే.. వాటిని నిలదీసే అవకాశం ఉందని భావిస్తున్న నాయకులు.. కొన్ని చోట్ల.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా.. ఏపనినైనా.. ప్రాజెక్టునైనా.. ప్రారంభించిన తర్వాత.. లేక.. ప్రారంభించబోయే ముందో.. శిలాఫలకాలు ఏర్పాటు చేస్తారు. ప్రారంభించిన తర్వాత.. వాటిలో పేర్లు రాసుకుంటారు. అయితే.. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో నాయకులు చిత్రమైన పనులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కీలకమైన వాటిని.. ముఖ్యంగా ఆయా పనులు చేపట్టినా.. కొంత సమయం పడుతుందని భావించే వాటిని తెరమీదికి తెస్తున్నారు. వాటికి `త్వరలోనే పనులు ప్రారంభించబడును` అని పేర్కొంటూ.. శిలా ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు.
అంటే.. ఆయా పనులను ఇప్పుడు ప్రారంభించరు. కానీ, ప్రారంభిస్తున్నట్టు శిలాఫలకాలు వేస్తారు. అంటే.. తాము ఇచ్చిన హామీల విషయంలో ప్రజలు ప్రశ్నిస్తే.. వీటిని చూపించి.. కొంత మేరకు వారి ఆగ్రహాన్ని చల్లార్చాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో సుమారు 25 పనులకు సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా.. నాయకులు శిలా ఫలకాలు సిద్ధం చేయిస్తున్నారు. త్వరలోనే జనంలోకి వెళ్లి.. వీటిని చూపించాలని.. అనుకుంటున్నారట. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.