ఏంద‌బ్బా ఇది జ‌న‌వ‌రి జీతం హుళ్ల‌క్కేనా!


ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులకు జనవరి నెల జీతాలు  సకాలంలో అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ల మధ్య ఏర్పడిన అంతరం మూలంగాఈ పరిస్థితి ఏర్పడుతోంది. రెండు వర్గాలు కూడా తమ పట్టు వీడక పోవడంతో జీతాల పై ఆధార పడిన ఉద్యోగుల కుటుంబాలు కష్టాలపాలయ్యే ప్రమాదం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులకు కొత్త స్కేళ్లను ప్రకటించిన ప్రభుత్వం సకాలంలో జనవరి నెలజీతాలను  అందిచాలని అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఖజానా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలా ఉంటే పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు తాము నూతన పీఆర్సీ ప్రక్రియ అమలు లో పాల్గోనబోమని  ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు.  నూతన పీఆర్సీ మేరకు జీతాలు చెల్లింపులు చేపట్టాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో క్రమం తప్పకుండా వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారు. ఖజానా అధికారులు రోజువారీ దినచర్యను ఆయన తన సిబ్బంది నిర్దేశించారు. జనవరి 31వ తేదీ వరకూ నిత్యం ఖజానా శాఖ జిల్లా అధికారులు తమ శాఖ డైరెక్టర్ కు పురోగతిని వివరించాల్సి ఉంటుంది. ఈ  ప్రక్రియ ఉదయం పదకుండు గంటల లోగా పూర్తి చేయాలి. ఖజానా శాఖ డైెరెక్టర్ ల ఆర్థిక శా కార్యదర్శికి ఉదయం పన్నెండు గంటల లోగా రోజు వారీ పురోగతి పై నివేదిక ఇవ్వాలి. జనవరి 25వ తేదీ నాటికిఅధికారులందరికీ పే రోల్స్ ను అందుబాటులో ఉంచాలని ఎస్ ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. నూతన పీఆర్సీ అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటి కప్పుడు ఉన్నతాధికారలతో వర్చువల్ గా సమావేశమవ్వాలని కూడా ఆయన తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతన పీఆర్సీ ప్రాకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. మరో వైపు ఉద్యోగులు దశల వారీగా ఆందోళనను ఉదృతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రెండు వర్గాలు తమ పట్టు సడలించక పోవడంతో ఉద్యోగులకు జనవరి నెల జీతాలు వచ్చే అవకాశం లేనట్లు గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: