మిస్ యూనివర్స్ : హర్నాజ్ ! కిరీట భారం మోయగలవా నీవు!

RATNA KISHORE
మిస్ యూనివర్స్ అనే పదం మనకు ఇప్పుడు కొత్త కాదు మూడో సారి వినిపిస్తున్న పదం.. ఈ కిరీటం కారణంగా దేశంలో అమ్మా యిలకు ఆత్మవిశ్వాసం పెరిగి పోతుందని, అల్ప జీవితాలు కొన్ని అమితం అయిన సంతోషాలు అందుకుంటాయని అనుకోలేం కా నీ ఈ కిరీటం కారణంగా కొన్ని మార్పులు ఆశించడంలో తప్పు లేదు. బక్కగా ఉన్న అమ్మాయిలకు, వాళ్లను ఉద్దేశించి చెప్పే మా టలకు చెక్ పెట్టేందుకు ఈ కిరీటం దాని కాంతి కొంత కాలం బాగుంటుంది అని కూడా అనుకోవచ్చు. విశ్లేషించనూ వచ్చు.. మొదట ఆమెను చూసి అలానే అనుకోనేవారని చదివేను.. హర్నాజ్ బక్క చిక్కినా భలే అందంగా ఉంది ఈ పిల్ల అని అనుకునేందుకు ఓ మెచ్చు తునక.,. మెరుపు వాకిట మెరిసిన అందం అని కూడా కవితాత్మకం చేయొచ్చు.. విజయాన్నీ కీర్తినీ కవితాత్మకం చేయ డంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా ఉంది.


అవును! బాధ్యత ఏంటంటే అమ్మాయిలకు ఈ కిరీటాల కారణంగా భద్రత వస్తుం దా లేదా ఇలాంటి అందాల పోటీల కారణంగానే వీరు బాలీవుడ్ లో నిలదొక్కుకుంటే ఎందరికి ఆ అవకాశం అందనిదిగా ఉండిపోయి ఉంటుంది.. ఈ తరహా ప్రశ్నలు కూడా మనలో పుట్టుకు రావొచ్చు. కీర్తి అన్నది అత్తరు లాంటిది.. అది ఒంటికి పూసుకోవాలే కానీ నెత్తికి ఎక్కించకూడదు అని హరివంశ్ రాయ్ బచ్చన్ ఓ చోట చెప్పారు.. ఇప్పుడీ కిరీటం ఏం నేర్పుతుంది.. అమ్మాయిలు అందం గా ఉన్న కారణంగా ధీమా కానీ ధీరత్వం కానీ వస్తుందా లేదా మన దేశంలో వ్యవస్థలు అమ్మాయిలకు మరింత భద్రత ఇచ్చి హా యిగా మీ పని మీరు చేసుకోండి.. తోటి వారితో పోటీ పడడం మానుకోకండి అని చెబుతాయా? ప్రతి విజయం ప్రతి కిరీటం కొన్ని పూలతో పాటూ ముళ్లూ ఇస్తుంది.. పూలను ప్రేమించడం ముళ్లను వదిలేయడం అన్నది తప్పు.. కనుక దేశంలో ఉన్న అందమ యిన అమ్మాయిలంతా ఇలాంటి పోటీలకు వెళ్తారో లేదో కానీ పోటీ తత్వం మాత్రం ఎవరికి వారు పెంపొందించుకుని తీరడం మాత్రం మరిచిపోకండి.. అందమయిన అమ్మాయిలు ఆత్మ విశ్వాస ప్రతీకలుగా ఉంటేనే ఈ దేశం నా దేశం గర్విస్తుంది.. అందం పోతుంద న్న బెంగతోనో, భయంతోనో ఆందోళనతోనో ఉండే అమ్మాయిలు మాత్రం ఇలాంటివి చదవకండి.. చదివినా వీటి నుంచి మీరు పొందే స్ఫూర్తి ఏమీ ఉండదు గాక ఉండదు.. ఎందుకంటే మీలోపలి నైజం మీతో సంస్కరణకు నోచుకోనంత కాలం అందం ఓ ఆకర్షణ గుణం మాత్రమే మరియు విలాసం మా త్రమే!


దుస్తులు కానీ కిరీటాలు కానీ శాశ్వతత్వం పొంది ఉండవు.. ఆ మాటకు వస్తే శరీరం శాశ్వతం కాదు కనుక ఇవి కూడా కాదు అని చెప్పే వేదాంతం నాలో లేదు. దుస్తులు జీవితాన్ని హుందా రూపంలో కనిపించేందుకు ఉపయోగపడతాయి. కిరీటాలు దేశం మన వైపు చూసేందుకు దోహదపడతాయి. దుస్తులు కానీ కిరీటాలు కానీ కీర్తి అంచుకు తీసుకుని వెళ్లాక మనల్ని ఓ స్థాయికి చేర్చి వ స్తాయి. దుస్తులలో అమ్మాయిలు తీసుకునే జాగ్రత్తలు, కీర్తి కిరీటాలు అందుకునేటప్పుడు అందుకునే సంతోషాలు ఇవన్నీ కూడా ఇకపై కూడా ఉండాలి ఉంటాయి కూడా! కనుక డిజైనర్ వేర్ అన్న పదంకు ఒక అర్థం అమ్మాయిల నుంచే పుట్టి ఉంటుంది. దుస్తు లు సౌకర్యం అయితే  కిరీటాలు ఒక్కోసారి ధీరత్వ ప్రతీకలు.. అందాల పోటీలలో వచ్చే కిరీటాలు కూడా ధీరత్వ ప్రతీకలే అయి ఉం టాయి. అవి సమానత్వ ప్రతీకలు అయి ఉంటాయా లేదా అన్నది తరువాత! అవార్డులు ఆనందాలు అన్నవి అప్పటికప్పుడు మా రిపోతూ ఉంటాయి. హర్నాజ్ జీవితం ఒక్క అవార్డు కారణంగా ఓ కిరీటం కారణంగా మారిపోవడం అన్నది బాగుంటుంది. ఆ కాంతి కూడా ఇంకొంత కాలం ఆమెతోనే ఉంటుంది. రేయి వేళ కూడా వెచ్చని హాయినే ఇస్తుంది. ఇచ్చి వెళ్తుంది. కానీ ఈ కీర్తి ఎంత కాలం ఉంటుందని? అదొక్కటే ప్రశ్న.. అదొక్కటే ఎడతెగని సందేహం కూడా కావొచ్చు. మిస్ యూనివర్స్ హర్నాజ్ కు శుభాకాంక్షలతో..
మీరు మోయాల్సిన భారాలే కాదు బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయని గుర్తు చేస్తూ..

- రత్నకిశోర్ శంభుమహంతి



a story on miss universe harnaaz kaur sandhu latest news  

harnaaz kaur  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: