జగన్ అంటే సీఎం : విజ‌య‌మ్మ‌కు జ‌య‌ము!

RATNA KISHORE

సెప్టెంబ‌ర్ 2 అనేక ప్ర‌త్యేక‌త‌ల క‌ల‌బోత‌
రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి స‌భ అందుకు వేదిక‌
ఇవేకాక ఎంద‌రో అభిమానుల  కూడిక
ఈ నేప‌థ్యంలో నొవాటెల్ కేంద్రంగా స‌మీక‌ర‌ణ‌లు
ఎలా ఉంటాయో అన్న‌ది ఓ ఆసక్తిదాయ‌క ప‌రిణామం
ఇదంతా విజ‌య‌మ్మ మార్కు రాజ‌కీయం జ‌య‌ము మీకు!
సుదీర్ఘ ప్రయాణంలో రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్రను రాజకీయ రంగంలో వేయగలిగారు. కాంగ్రెస్ పార్టీని నడిపి రెండుసార్లు అధి కారంలోకి తీసుకురాగలిగారు. ఒంటి చేత్తో పార్టీని నడిపి గెలుపు బావుటా ఎగరవేశారు. ఆ పతాక స్థాయి విజయాలు చిరస్మరణీ యం. కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కు కొత్త జీ వితాన్ని ఇచ్చింది అని చెప్పే కన్నా వైయస్సార్ లాంటి నాయకులు మాత్రమే కాంగ్రెస్కు జవము - జీవము పోయగలరు అనేందుకు ఉదాహరణలు ఎన్నో! రాజశేఖర్ రెడ్డి తనదైన వ్యక్తిగత క్రమశిక్షణతో పార్టీని సమున్న త రీతిలో ఉంచి, తద్వారా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయాలకు కారణమయ్యారు. రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు అని చెప్పేందు కు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వాదులకు ఓ సమాధానంగా నిలిచి పార్టీని ఏకతాటిపై నిలిపి గొప్ప విజయాలు నమోదు కారణమయ్యారు.
ధ‌ర్మ సందేహం : నివాళి వేళ‌
...........రాజ‌కీయం త‌గునా!
పాదయాత్ర అన్నది తన జీవితాన్ని మార్చిందని ఎప్పుడు చెబుతుంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతాల లో పాదయాత్ర చేస్తూ..ఇక్కడి జనం..ఇక్కడి కష్టం..ఇక్కడి సమస్య .. ఇక్కడ సంస్కృతి..సంబంధిత విధ్వంసం వీటన్నింటిపై మా ట్లాడేందుకు తగిన అవగాహన పెం పొందించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేళ కొన్ని జ్ఞాపకాలు ఆయన అభిమానుల్లో కదలా డుతున్నాయి రాజశేఖర్ రెడ్డి.  ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి వచ్చిన సంద ర్భంలో ఆయన వెంట నడిచిన ఎందరో తర్వాత కాలంలో నా యకులుగా ఎదిగారు. నాటి కార్యకర్తలు నేటి నాయకులు ఆయన సం స్మరణ వేళ కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆ ర్ తెలంగాణ పార్టీ ఏ విధంగా తమ తమ స్థాయిలో నివాళులర్పిస్తారు అన్నది ఇప్పుడిక కీలకం.
ఎనీ డౌట్స్ : భేదాలు లేవ‌ని
.....ఏక‌తా గీతం వినిపిస్తారా?
హైదరాబాద్ దారులలో నొవాటెల్ హోటల్ లో విజయమ్మ నేతృత్వంలో ఏర్పాటు చేసే సంస్మరణ అన్నది ఇది ఏ స్థాయిలో విజ యవంతం అవుతుంది అన్నది ఇప్పుడిక కీలకం. విజయమ్మ అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రా నుంచి కీలక నాయకులకు ఆహ్వానాలు పంపారు. ఇరు రాష్ట్రాలలో వైయస్సార్ అభిమానులు ఈ వేడుకకు రానున్నారు. వైయస్ జగన్ వైయస్ షర్మిల ఒకే వే దికపై కనిపిస్తారా? అన్నదే ఇప్పుడిక ఆసక్తిదాయకం తమ కుటుంబంలో భేదాలు లేవని చెబుతారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: