కృష్ణాష్ఠ‌మి : మంచి స్నేహాలు మంచి కాలాలు

RATNA KISHORE
గోపెమ్మ‌లు ఎంద‌రున్నా ఒక క‌థ మాత్రం ప్ర‌త్యేకం
మాతృమూర్తులు ఎందురున్నా ఒక క‌థ మాత్రం వైవిధ్యం
జీవితం ఒక్క ద‌గ్గ‌ర ఆగిపోతుంది అనుకుంటాను
ఆ అల‌ల చెంత ఉద్ధృతి ఉంటే న‌డిచి వ‌చ్చే త‌రంగాల‌కు అదుపు
భ‌గ‌వంతుడు కాక ఇంకెవ్వ‌రు?


స్నేహం అంటే క‌ద‌లివ‌చ్చిన త‌త్వం..వైరం అంటే స‌మాప్తి చేసిన త‌త్వం..మంచి లోకాల ప్రాప్తికి దారి ఇచ్చిన వైనం..ఆ కృష్ణయ్య  చెం త నేర్చుకున్న‌దంతా చిలికి చిలికి ఒల‌క‌బోస్తున్నాను..తేలియాడే సారాన్ని మ‌నం జీవిత త‌త్వం అని గుర్తించాలి..తేల‌ని సందిగ్ధా లను వెతికేందుకు  ఓ ప‌రిష్కారం క‌నుగొనేందుకు ఇప్ప‌టి జ్ఞానం ఓ ఆన‌వాలు అని గుర్తించాలి. స‌హాయ‌కారి కృష్ణుడు అని రాయా లి. యుద్ధం వ‌ద్ద‌నుకుంటే వ‌ద్దు..ప్రేమ కావాల‌నుకుంటే కావాలి.. ప్రేమ తో న‌లుగురి నుంచి పొందిన అభిమానం వ‌ద్ద కృష్ణుడు అనిత ర సాధ్య‌తను సాధించాడు. ప్రేమ‌లో రుషిత‌త్వం ఉంది. ఇత‌రుల‌కు అందించ‌డ‌మే అంతిమ గుణం అయి ఉంది. అటువంటి గుణాలకు ప్ర‌తీక అత‌డు. స‌త్ గ‌తుల‌కు ప్ర‌తీక కృష్ణుడు. స‌త్ గ‌తుల ప్రాప్తికి కార‌ణం కృష్ణుడు. ఇంకా చెప్పాలంటే ఒక కార‌ణం ఒక ఫ‌లితం అదే నేను అదే నువ్వు అని చెప్పిన తాత్వికుడు కృష్ణుడు.


అటుకులు ఇస్తే పొంగిపోతాడు.. ఆ గుప్పెడు అటుకుల్లో గుప్పెడు ప్రేమ.. కుచేలుడు కృష్ణుడు..ఆధునిక కాలంలో చూడాలి మ‌నం.ఆదర్శం అని చెప్పుకోవ‌డంలో ఏ అర్థం లేదు. పాటింపు ద‌గ్గ‌ర  స్నేహం ఉంటుంది. పాటింపు ద‌గ్గ‌ర ప్రేమ ఉంటుంది. ఆద‌ర్శం అంటే
రాయ‌ద‌గిన‌ది కాదు పాటింప‌ద‌గిన‌ది అని అర్థం. స్నేహాలు మంచి ని మిగిల్చి మంచిని పెంచి పోతాయి..అవి మంచిని మాత్ర‌మే ప్ర‌బోధిస్తాయి. కాలం ఇటువంటి స్నేహాల‌కు దారి ఇవ్వ‌దు మ‌నం వెతుక్కోవాలి. జీవితం ఒక ద‌గ్గ‌ర ఆగిపోయిన చోటు నుంచి
మ‌నం వికాసం పొంది ఉండాలి. అప్పుడు స్నేహాలు మ‌న‌కు ధ‌ర్మ సూక్షాల‌ను కూడా బోధిస్తాయి. నీతి సూత్రం పాటింపులో ఉంది. అనుగ్ర‌హ‌ణ అన్న‌ది అప్పుడే సాధ్యం. ఈ పండుగ వేళ మంచి స్నేహాల‌ను పొందండి.. మంచి ని ఆచ‌రింప‌జేసే స్నేహాలే ఈ స‌మాజానికి దారి చూపుతాయి. అన్ని దారులూ మ‌న‌వే అయి ఉంటాయి. దారి నిర్మాణంలో మ‌నం కొంత సాయం చేస్తే కొత్త ఊహ‌ల‌కు సాకారం సాధ్యం. క‌ల‌ల‌కు సాకారం సాధ్యం. విహిత క‌ర్త‌వ్యం (పాటించ‌ద‌గ్గ క‌ర్త‌వ్యం లేదా చేయ‌ద‌గ్గ ప‌ని) ఏంట‌న్న‌ది ఎవ‌రికి వారు తెలుసుకోవాలి అందుకు స్నేహితాలు ఉప‌యుక్తం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: