కృష్ణాష్టమి: సిసలైన ట్రబుల్ షూటర్‌ గడ్కరీ..!

ఇవాళ కృష్ణాష్టమి.. కృష్ణుడిని స్మరించుకోవాల్సిన రోజు.. కేవలం కృష్ణుడినే కాదు.. ఆయనలోని సుగుణాలను అందిపుచ్చుకునేందుకు స్ఫూర్తి పొందాల్సిన రోజు కూడా. కృష్ణుడంటే.. బహుముఖ రూపుడు.. ఆయన్ను ఒక కోణంలోనే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆయన అవతారానికి ఎన్ని కారణాలో.. ఎన్ని ఫలితాలో.. ఇక కృష్ణుడిలోని సుగుణం మనం నేర్చుకోవాల్సిన గుణం సమస్య పరిష్కార నైపుణ్యం.. ఎలాంటి సమస్యైనా ఇట్టే పరిష్కరించగలగడం.

ఈ ట్రబుల్ షూటింగ్ లక్షణం అందరికీ అవసరమే అయినా.. రాజకీయ నాయకులకు ఇంకా అవసరం.. నిత్యం వేలమందితో డీల్‌ చేసే నాయకులకు ఈ లక్షణం ఉంటే రాజకీయాల్లో బాగా రాణిస్తారు.. అలా రాణించిన నాయకుల్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. ఇప్పుడంటే బీజేపీ అధికారంలో ఉంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సమస్యలు తక్కువ. కానీ.. నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది.

బీజేపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నితిన్ గడ్కరీ పార్టీ కోసం బాగా పని చేశారు.. కష్టపడ్డారు. పార్టీలోని వివిధ గ్రూపులను సమన్వయం చేసుకున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లారు. అప్పుడే మోదీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. మోదీని అంగీకరించని పాత తరం నేతలను గడ్కరీ తన చాణక్యంతో ఒప్పించారు. మోదీకి మార్గం సుగమం చేశారు. అలా మొత్తానికి పార్టీని అధికారంలోకి తెచ్చాడు నితిన్ గడ్కరీ.

పార్టీనే కాదు.. పార్టీ మూల స్థంభమైన సంఘ్ పరివార్ ని కూడా బలోపేతం చేశాడు నితిన్ గడ్కరీ. 2014 లో పార్టీ అధికారం లోకి వచ్చే సమయంలో పార్టీ చీఫ్‌గా ఉన్న గడ్కరీ.. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచేందుకు వ్యూహం రచించి సఫలం అయ్యారు. మొత్తానికి బీజేపీకి నితిన్ గడ్కరీ రూపంలో ఓ మంచి ట్రబుల్ షూటర్ లభించాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: