హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ మెలికతో టీడీపీకి షాకేనా ?

Vijaya
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన మెలికతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీకి పెద్ద షాకే తగిలింది. అప్పట్లో నామినేషన్లు వేయలేపోయిన వారంతా ఇపుడు నామినేషన్లు వేయచ్చని చెప్పటంతో ప్రతిపక్షాలంతా ఫుల్లుగా ఖుషీ అయ్యాయి. అయితే నామినేషన్లు వేయచ్చని చెబుతునే అందుకు తగిన ఆధారాలు సమర్పించాల్సుంటుందని మెలిక పెట్టారు. దాంతో ప్రతిపక్షాలంతా మండిపోతున్నాయి. తమను బెదిరించారని, తమపై ధౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేస్తే చాలదని అందుకు తగిన ఆధారాలు చూపితేనే రిటర్నింగ్ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తారని స్పష్టంగా చెప్పారు. తాము ఫిర్యాదులు చేయగానే నేరుగా అప్పటి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసేస్తారని అనుకున్నారు.



నిమ్మగడ్డ పెట్టిన తాజా మెలికతో ప్రతిపక్షాలన్నీ మండిపోతున్నాయి. అప్పట్లో చేసిన ధౌర్జన్యాలకు, బెదిరింపులకు ఇపుడు ఆధారాలను ఎక్కడి నుండి తేగలమని ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. నిమ్మగడ్డ తాజా మెలికతో చాలా చోట్ల ప్రతిపక్షాలకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఎందుకంటే నిమ్మగడ్డ మొదటి ప్రకటనతో ప్రతిపక్షాల తరపున అప్పట్లో వివిధ కారణాల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారంతా ఇపుడు నామినేషన్లు వేయటానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఆధారాలనే మెలిక పెట్టడంతో చాలామంది వెనక్కు వెళ్ళక  తప్పదు. బెదిరింపులకు తగిన ఆధారాలు దొరకటం కష్టమే. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా బెదిరించాలని అనుకున్నా అవేవీ బహిరంగంగా జరగే అవకాశాలు తక్కువ.



ఇక ధౌర్జన్యాలంటే వీటికి వీడియో ఎవిడెన్సులు తప్పవు. వీడియో ఎవిడెన్సుల రూపంలో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టే ఘటనలు తక్కువనే చెప్పాలి. కాబట్టి నిమ్మగడ్డ ఇచ్చిన వెసులుబాటు కారణంగా ప్రతిపక్షాలకు జరిగే ఉపయోగం పెద్దగా ఉండదనే చెప్పాలి. మరి ఈ మాత్రానికే మొదట్లో ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయో అర్ధం కావటంలేదు. కమీషనర్ ప్రకటనలోని అసలు మెలిక అర్ధమైన తర్వాత ఇపుడు ప్రతిపక్షాలు నిమ్మగడ్డపై మండిపడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కలిసి నిమ్మగడ్డపై మాటలతో దాడులు చేస్తాయోమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: