జగన్‌కు అవమానం.. మరి మోడీ ఎలా స్పందిస్తారో..?
కేంద్రం ఇలా వ్యవహరించడం అవమానకరంగా.. ఇబ్బంది ఉందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే ప్రధాని జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని జగన్ ప్రధానిని కోరారు. అయితే ఇప్పుడు మోడీ లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. అసలు పోలవరం విషయంలో ఏం జరిగిందంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించింది. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లు. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.1 కోట్లకు పరిమితం చేసింది.
ఇలా చేయడమంటే జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను ఉల్లంఘించినట్లే. అందుకే ఈ వ్యవహారంలో తక్షణమే మోడీ జోక్యం చేసుకోవాలని జగన్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం అంటే సీడబ్ల్యూసీ, సాంకేతిక సలహా కమిటీ , ఆర్‌సీసీ ఆమోదించిన మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలను పెట్టుబడి అనుమతి జారీ చేసేలా దిశానిర్దేశం చేయండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మరి ప్రధాని మోదీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.