ఎడిటోరియల్: మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్.. కొట్టుకోవడమే నేటి రాజకీయం

రాజకీయ పార్టీలైన, రాజకీయ నాయకులైనా పని చేసేది ప్రజల కోసమే. వారు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత కష్టపడినా, అంతిమంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా పరిపాలన అందించే విధంగా, ఎప్పటికప్పుడు వారి కష్టాలను గుర్తించి, ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందే విధంగా చేయడం వారి పని. అసలు రాజకీయాల్లోకి రావాల్సింది ఆ ఉద్దేశంతో. విలువలు, విశ్వసనీయత, నిబద్ధత, ఇవన్నీ నాయకుల లక్షణాలుగా ఉండాలి. ఇవన్నీ పక్కనపెడితే రాజకీయం అనేది హుందాగా ఉండాలి. వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీతత్వం ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా, ప్రజలకు మేలు చేసే విషయంలో ఉండాలి తప్ప, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి, కొట్టుకోవడానికి కాదు. గతంలో ఉన్న రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది. 


తమకు నచ్చని వారిపై విమర్శలు చేయడమే కాదు, వారితో కొట్లాటకు దిగేందుకు కూడా వెనకాడడం లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఒకరకంగా రాజకీయ నాయకులు, పార్టీలు అంటే జనాలకు అసహ్యం కలిగించే విధంగా పరిస్థితి మారిపోయింది. తాజాగా తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. టిఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. టిఆర్ఎస్ పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత కెసిఆర్ గురించి నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ వరంగల్ లో చేసిన విమర్శలు టీఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం కలిగించాయి. దాంతో ఆయనపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు.

 

 అలాగే ఎప్పటి నుంచో టిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ వివిధ మీడియా చానళ్లలో ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయనపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. అయినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆయన పైన నిజామాబాద్ శివారులో దాడి జరిగింది. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు పాల్పడింది ఎమ్మెల్యే ఆశన్న గారి jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">జీవన్ రెడ్డి అనుచరులు అని ప్రచారం జరిగింది. వేరు వేరు ప్రాంతాల్లో ఒక్కరోజులోనే, ఒక ఎంపీ పైన, ఒక జర్నలిస్టు పైన భౌతిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

 


ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. ఏపీలోనూ, తెలంగాణలోనూ, ఇలా ఎక్కడ చూసినా నాయకులు భౌతికంగా దాడి చేసుకునే వరకు పరిస్థితులు ఉండడం, రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల పైన జనాలకు చులకన భావం ఏర్పడేలా చేస్తోంది. హుందాగా రాజకీయలు చేసే నాయకుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుండటంతో రాజకీయాల్లో విలువలు తగ్గిపోతూ ఉండడం నిజంగా బాధాకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: