కరోనా కారణంగా బాగా దెబ్బ తిన్న రంగాల్లో మీడియా ఒకటి. అందులోనూ ప్రింట్ మీడియా అయితే దారుణంగా నష్టపోయింది. ఓవైపు యాడ్ల ఆదాయం తగ్గిపోవడం ఓ కారణం అయితే.. మరోవైపు ప్రింటింగ్ ఖర్చులు పెరిగిపోవడం మరో కారణం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో అంతగా ఖర్చులు లేకపోయినా.. కనీసం సిబ్బంది వేతనాలకు సరిపోయే యాడ్లు కూడా రావడం లేదు.
అయితే ఇలాంటి సయమంలో జర్నలిస్టులకు యూట్యూబ్ ఓ వరంగా మారింది. గతంలో అనేక యాజమాన్యాల దగ్గర ఊడిగం చేసే కంటే.. కంటెంట్ ఉన్న జర్నలిస్టు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అటు పేరుకు పేరు.. ఇటు ఉద్యోగానికి దీటుగా సంపాదన లభిస్తోంది. తెలుగులో ఇలా కొందరు జర్నలిస్టులు బాగా సంపాదిస్తున్నారు. ప్రత్యేకంగా రాజకీయాలను విశ్లేషించే వారికి ఈ యూట్యూబ్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రోజు వారీ పరిణామాల్లోని లోతుపాతులను సాధికారికంగా వివరించే వారిని నెటిజన్లు బాగా ఆదరిస్తున్నారు.
ప్రధాన మీడియా పూర్తిగా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోవడం వల్ల నెటిజన్లు వాస్తవాల వెనుక కథల కోసం ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల వెనుక అసలు కథ ఏంటో వీరు చక్కగా వివరిస్తున్నారు. ఇలాంటి విశ్లేషణ నిష్పాక్షికంగా ప్రధాన మీడియాలో లభించకపోవడం వీరికి వరంగా మారింది.
ఒక విధంగా ఈ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఆయా జర్నలిస్టుల ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. గతంలో ఏదో ఒక ఛానళ్లో ఎప్పుడో కొద్దిసేపు కనిపించే వీరు. ఇప్పుడు రోజుకు దాదాపు 10 వీడియోల వరకూ పోస్టు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. కరోనా వచ్చినా.. గిరోనా వచ్చినా వీరి ఆదాయానికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: