ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సులు?

Purushottham Vinay
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్‌ జీ.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ - దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది.బీఏ, బీబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ప్రోగ్రామ్‌లో వ్యవధి మూడేళ్లు. బీఏ, బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌), బీకాం(జనరల్‌), బీబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) ప్రోగ్రామ్‌నకు మాత్రం ఇంటర్‌ స్థాయిలో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు విషయానికి వస్తే..బీఏ, బీఏ(మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌)ప్రోగ్రామ్‌లకు రూ.4,000; బీకాం(జనరల్‌)కు రూ.5,000; బీబీఏకు రూ.8,000 ఉంటుంది.పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. మేథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000. బయోఇన్ఫర్మాటిక్స్‌ స్పెషలైజేషన్‌కు ద్వితీయశ్రేణి మార్కులతో బీఎస్సీ/ బీఎస్సీ(అగ్రికల్చర్‌)/ ఎమ్మెస్సీ/ బీఫార్మసీ/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/బీయూఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఈ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.30,000 ఉంటుంది.


అలాగే ఎంఏ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఉర్దూ, హిందీ, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్‌, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ స్పెషలైజేషన్‌లకు బీఈ/ బీటెక్‌/ బీసీఏ సహా ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, స్పెషలైజేషన్‌లకు సంబంధిత సబ్జెక్ట్‌లతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎకనామిక్స్‌ స్పెషలైజేషన్‌కు బీకాం అభ్యర్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు వచ్చేసి ఇంగ్లీష్‌కు రూ.6,500; సైకాలజీకి రూ.9,000; మిగిలిన స్పెషలైజేషన్‌లకు రూ.6,000 ఉంటుంది.ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మేథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌కు డిగ్రీ(మేథమెటిక్స్‌); స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌కు డిగ్రీ(మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.ప్రోగ్రామ్‌ వార్షిక ఫీజు వచ్చేసి మేథమెటిక్స్‌కు రూ.6,500; స్టాటిస్టిక్స్‌కు రూ.6,000 ఉంటుంది.


ఎంకాం ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. బీకాం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు ఏడాదికి రూ.6,500 ఉంటుంది.అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా విషయానికి వస్తే..ఇందులో స్పెషలైజేషన్‌ వేదిక్‌ ఆస్ట్రాలజీ. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. పీజీ డిప్లొమా(వేదిక్‌ ఆస్ట్రాలజీ) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000 ఉంటుంది.సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగ ప్రోగ్రామ్‌ వ్యవధి ఆర్నెల్లు. పదోతరగతి/ మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌ ఫీజు రూ.6,000 ఉంటుంది.ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.10,000, ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు సెమిస్టర్‌కు రూ.7,500 ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: