ఆ రెండు సభలు.. తెలంగాణ రాజకీయం మార్చేస్తాయా..?
అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 2 న వెలువడబోతోంది. అదే నవంబర్లో తెలంగాణలో మరో కీలకమైన సభ జరగబోతోంది. ఆ తర్వాత డిసెంబర్లో మరో కీలకమైన సభ జరగబోతోంది. అంటే వచ్చే రెండు నెలల్లో రెండు కీలకమైన రాజకీయ సభలు జరగబోతున్నాయి. అవేంటంటే.. నవంబర్ 15న టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ నిర్వహించబోతోంది. ఇక డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించబోతోంది. అయితే.. ఈ రెండు సభలే తెలంగాణ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.
అసలు కాంగ్రెస్ ఇటీవల నిర్వహిస్తున్న సభలు,సమావేశాలతోనే కేసీఆర్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9 న కేసీఆర్ సభకు మించి కాంగ్రెస్ సభ ఉంటుందని సవాల్ చేస్తున్నారు. ఈ సభలే తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలను మార్చబోతున్నాయని ధీమాగా చెబుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అని.. అందుకే ఆయన నవంబరు15న సభ పెట్టాడని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే తన లక్కీ నెంబర్ 9 అనీ.. అందుకే డిసెంబర్ 9 న సభ నిర్వహిస్తున్నానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
అంతే కాదు.. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ రెడ్డి నొక్కివక్కాణిస్తున్నారు. మరి ఈ రెండు సభలు ఏ రేంజ్లో జరుగుతాయో చూద్దాం.. దాన్ని బట్టి తెలంగాణ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో ఓ అంచనాకు వద్దాం.. ఏమంటారు.?