బాబుకు అనుకూలిస్తున్న గ్రహాలు.. ఏం చేసినా కలిసొస్తోందిగా?

Chakravarthi Kalyan
గత కొన్ని రోజులుగా ఉద్యోగులు-ప్రైవేట్ కంపెనీలు.. మధ్యలో కర్ణాటక సర్కారు అనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. తర్వాత నాలుక కరుచుకుందనే చెప్పాలి. ఇదే సమయంలో మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది.

అవును కర్ణాటకలో ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లు అనే అంశం బూమ్ రాంగ్ అయింది. అయితే దీనిని సిద్ధరామయ్య సర్కారు పక్కన పెట్టింది. ఇప్పుడు మరో తేనె తుట్టెను కదిపింది. అదేంటంటే.. ప్రైవేట్ ఉద్యోగుల పని గంటలు. ఇదేంటంటే.. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వేళలను పెంచాలని కర్ణాటక సర్కారు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కన్నడ మంత్రి ప్రియాంక్ ఖర్గే ధ్రువీకరించారు కూడా.  ప్రస్తుతానికి అయితే ఈ అంశంపై  చర్చలు జరుగుతున్నాయని మరో మంత్రి సంతోష్ లాడ్ వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్లు అనే అంశంతో బెంగళూర్ సిటీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఆ సిటీ కి బ్రాండ్ డ్యామేజ్ జరిగిందని పలు సంస్థలు వెల్లడించాయి. ఇప్పుడు ఉద్యోగుల పని గంటలుతో అక్కడ ఉద్యోగాలు చేసేందుకు యువత ఇష్టపడరు. పైగా అక్కడ లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ.

ఈ సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ లు కొంచెం చొరవ చూపితే పలు కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  స్థానిక రిజర్వేషన్ల సమయంలో నారా లోకేశ్ సమయస్ఫూర్తి ప్రకటించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. ఇక్కడ బోలెడు అవకాశాలు ఉన్నాయి.. పైగా షరతులు కూడా లేవని పలు బెంగళూరు లోని కంపెనీలను ఆహ్వానించారు. ఇప్పుడు మరోసారి కర్ణాటకలో సందిగ్ధం నెలకొని ఉంది.  పైగా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ.  దీంతో ఉద్యోగులు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.  ఉద్యోగులు వస్తానంటే కంపెనీలు కూడా ముందుకు వస్తాయి.  ఈ సమయంలో ఈ అంశంపై శ్రద్ధ చూపాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: