వినుకొండ టూర్‌తో జగన్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిందా?

Chakravarthi Kalyan
సినీ గ్లామర్ వేరు. రాజకీయ గ్లామర్ వేరు. ఎవరైనా సినీ హీరో బయటకు వస్తే ఆయన్ను చూసేందుకు ప్రజలంతా రోడ్డుపైకి వస్తారు. క్షణాల్లో జన సందోహం అయిపోతుంది. అదే రాజకీయ నేతలు అయితే కచ్ఛితంగా జన సమీకరణ చేయాలి.  కాకపోతే కొంత మంది నాయకులు మాత్రం వస్తున్నారు అని తెలిస్తే చాలు జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తుంటారు.  అలాంటి రాజకీయ గ్లామర్ కలిగిన నేతల్లో వైఎస్ జగన్ ఒకరు.  వైసీపీ అధినేతకి ఎంతటి ఆదరణ ఉందో మరోసారి బయట పడింది.  

వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురి కావడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండ వెళ్లారు. మార్గమధ్యలో ఆయన అభిమానులు అడుగడుగునా కాన్వాయ్ ని ఆపి మరి జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్లాలంటే సాధారణంగా పట్టే సమయం రెండు లేదా రెండున్నర గంటలు.
కానీ జగన్ కు అందుకు దాదాపు రెట్టింపు సమయం పట్టింది. విజయవాడలో జోరు వానలో మొదలైన జగన్ పర్యటన.. అదే వానలో ఆశేష జనవాహిని, అభిమానులు తాకిడి ల మధ్య కొనసాగింది. మాజీ సీఎంకు కొత్తగా కేటాయించే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంగళగిరి వద్ద.. ఆయన పార్టీ నాయకుడికి చెందిన మరో కారులోకి మారారు. ఆ తర్వాత రూట్ లో ప్రతి చోట పెద్ద ఎత్తున అభిమానులు సంఘీభావం ప్రకటిస్తూ తరలి వచ్చారు.
దీంతో ఆయన తన వాహనాన్ని ఆపుతూ.. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇక గుంటూరు, చిలకలూరిపేట, నర్సారావుపేట బైపాస్ రోడ్ల  వద్ద అభిమానులు పోటెత్తడంతో ఆయన ప్రయాణానికి బ్రేక్ పడింది. వర్షం కురుస్తున్నా.. ఆయన అభిమానులు ఎక్కడా తగ్గలేదు. మరోవైపు పరిమిత సంఖ్యలోనే వాహనాలు వెళ్లాలని పోలీసులు పదేపదే పార్టీ నాయకుల కార్లను అడ్డుకున్నారు. ఇక జగన్ రాకతో వినుకొండ జనసంద్రం అయింది. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ అధినేత వారికి భరోసా కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: