పుతిన్‌ బుర్రే బుర్ర.. చరిత్రనే తిరగరాయిస్తున్నాడుగా?

Chakravarthi Kalyan
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు ఓ మహా కవి. మనం ఎక్కడ ఉన్నా మన మూలాలు, చరిత్ర గురించి తక్కువ చేసి చెప్పకూడదు. అదే సమయంలో మన దేశ గొప్పతనాన్ని సగర్వంగా చెప్పుకోగలగాలి. కానీ విదేశాల్లో ఉంటున్న వారి గురించి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం.. తప్ప మన గురించి అక్కడి వారు ఎవరూ నోరు మెదపరు.

ప్రస్తుతం ఏ దేశంలో చూసినా భారతి సంతతి వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతున్నారు. అధికార పీఠం ఎక్కుతున్నారు. వీరిలో ఏ మాత్రం భారతీయ మూలాలున్నా కానీ వారిని మనం ఓన్ చేసుకొని మనోడే అని సగర్వంగా చెప్పుకుంటున్నాం.  అధిక సంపాదన, త్వరగా స్థిరపడొచ్చు అనే భావనతో మన వాళ్లు ఎక్కువగా విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. వీరు వెళ్లేది అంతా క్రైస్తవ, ముస్లిం దేశాలు కాబట్టి మన చరిత్ర గురించి వారు వినరు.  

పొరపారటున చెప్తే వారు మనల్ని ఏం చేస్తారో.. ఉద్యోగం నుంచి తీసేస్తారో అనే భయంతో మన వాళ్లు కూడా చరిత్ర చెప్పడానికి ముందుకు రారు. ఒకప్పుడు మన దేశంపై దండయాత్ర చేసి.. మన సంపద దోచుకెళ్లిన వారి దేశాలకు వెళ్లి ప్రస్తుతం నివాసం ఉంటున్నాం.  స్వత్రంత్ర భారతం గురించి మనం గొప్పగా చెప్పుకుంటే వారికి కోపం వస్తుంది.  అందుకే విదేశీ గడ్డపై మన వాళ్లు మౌనం పాటిస్తారు.

కానీ చెప్పినా చెప్పకపోయినా.. చరిత్ర మారిపోదు. ఇది శాశ్వతం. అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పనిలేదు. మన కళ్లెదుటే కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో రష్యా ఏయే దేశాలపై దండయాత్రలు చేసింది. దాడులు చేసింది, పారిశ్రామిక విప్లవం ద్వారా ఎలాంటి పోరాటాలు  చేసింది, దానివల్లం ఏం సాధించింది వంటి విషయాలు ఆ దేశ పుస్తకాల్లో ఉండేవి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇతర అంశాల క్రమాన్ని కొత్త చరిత్ర పుస్తకాలను రాయాలని పుతిన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తద్వారా భవిష్యత్తు తరాలకు ఊతం, ఊపు ఇచ్చేలా కొత్త చరిత్రను రాయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: