స్టాలిన్‌.. నీ పద్దదేమీ బాగోలేదయ్యా?

Chakravarthi Kalyan
తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 70మందికి పైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వందల మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు, మృతుల దహన సంస్కారాల దృశ్యాలు మనసు కలచి వేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. కల్తీసారా ప్రధాన కారకుడిని పది రోజుల క్రితమే పోలీసులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నందున అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారనే వార్తలు వచ్చాయి. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ఊహించని అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. కల్తీ మద్యాన్ని తయారు చేసే, విక్రయించే వారు ఏళ్లుగా అదే పని చేస్తున్నారంటే వారికి అండగా నాయకులు, పోలీసులు ఉన్నారనే విషయం స్పష్టం అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కల్తీ సారా అమ్మకాలు జరుగుతున్నాయో తాను మార్చిలోనే అసెంబ్లీకి తెలియజేసి హెచ్చరించామని అన్నాడీఎంకే అంటోంది. కల్లకురిచ్చి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కల్తీ సారా అమ్మకాలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చిన విషయాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై డీఎంకే సర్కారు, సీఎం స్టాలిన్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కళ్లకురిచి ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే నిరసనలు చేపట్టింది. అయితే ప్రస్తుతం తమిళనాడులో శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు సభలో చర్చలు జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని కఠిన చట్టాల  అవసరం ఉంది.

కానీ… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో  ఈ అంశం లేవనెత్తడానికి అధికార పక్షం అనుమతి ఇవ్వడం లేదు. కోరలు చాచిన సారా రక్కసిపై అసెంబ్లీలో చర్చకు అన్నాడీఎంకే సభ్యులు ఐదు రోజులుగా పట్టుబడుతూ వస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వీరు రాద్దాంతం సృష్టిస్తున్నారంటూ స్పీకర్ ఈ సమావేశాలు మొత్తం అన్నా డీఎంకే సభ్యులు సభకు హాజరు కాకుండా సస్పెండ్ చేశారు. అసలు దీనిపై చర్చ జరగకుండా ఉండేలా అధికార డీఎంకే వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదు అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: