ఇక అక్కడ రోబోలే యుద్ధం చేస్తాయా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ తో యుద్ధంలో ఇటీవల రష్యా సైన్యం దూకుడు పెంచింది. క్షేత్ర స్థాయిలో గణనీయమైన విజయాలను సాధిస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. మాస్కో దగ్గర చాలినంత వనరులు ఉన్నాయి. ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయి. ఉక్రెయిన్ పరిస్థితి పూర్తిగా వేరు. సైనికుల కొరత ఆ దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఆయుధాలు అంత వేగంగా అందడం లేదు. సైనికుల కొరతను అధికమించేందుకు దేశ విదేశాల్లో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.

ఉక్రెయిన్ పౌరులను పంపించేందుకు ఏ దేశం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో ఆ దేశం సరికొత్త వ్యూహాన్ని శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మానవ వనరుల కొరతను రోబోలతో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఉక్రెయిన్ వ్యాప్తంగా కృత్రిమ మేధ సాయంతో భారీ సంఖ్యలో రోబో సైనికులను తయారు చేసే పనిలో పడింది.

ఈ రోబోలు ప్రత్యర్థి సైనికులను చంపడమే కాకుండా తమ సైనికులను రక్షించే పని కూడా చేయనున్నాయి. ఒక్క రోబోలనే కాదు. డ్రోన్లు.. ఒతర మానవ రహిత వాహనాలు తయారు చేసే స్టార్టప్ సంస్థలు ఉక్రెయినంతా వెలిశాయి. దాదాపు 250 స్టార్టప్ సంస్థలు దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నాయని ఓ అంచనా.
ఈ సంస్థలు చూడ్డానికి పాత మెకానిక్ దుకాణాల్లా, గోదాముల్లా, పాడైపోయిన ఫ్యాక్టీరీలా కనిపిస్తాయి. కానీ లోపల కృత్రిమ మేధను ఉపయోగిస్తూ ఇంజినీర్లు తక్కువ ధరకే అత్యాధునిక ఆటోమేటిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. మేం అతిపెద్ద దేశంతో యుద్ధం చేస్తున్నాం. వారికి ఉన్న వనరులు మాకు లేవు. మనుషులు లేరు అని ఉక్రెయిన్ రక్షణ రంగ స్టార్టప్ సంస్థ యూకేఆర్ ప్రోటో టైప్ అధిపతి డెనెసెంకో స్పష్టం చేశారు. అయితే ఈ సైనిక రోబోలు సక్సెస్ అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు అతి తక్కువ ఖర్చుతో రూపొందించే వీటిపై ఆధారపడతాయి. మానవులపై ఆధారపడటం తగ్గించేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: