రహస్యం: మోదీ టాప్‌ సీక్రెట్‌ బయటపెట్టిన జర్నలిస్టు?

Chakravarthi Kalyan
బలహీన ప్రతిపక్షమే నరేంద్ర మోదీ బలం అంటున్నారు సీనియర్ పాత్రికేయుడు సుతను గురు. ఈ సుతను గురు ఎవరు అనుకుంటున్నారా.. ఆయన  సీనియర్ పాత్రికేయుడు, CVOTER రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. సవాలక్ష సమస్యలతో దేశ ప్రజలు సతమతం అవుతోందని.. కానీ ప్రజల్లోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోగల ప్రతిపక్షం లేకపోవడం మోడీకి కలసి వస్తోందని సుతను గురు అంటున్నారు.

సుతను గురు ప్రస్తుతం ఇండియా టు భారత్ పేరిట 90- రోజుల దేశయాత్ర చేస్తున్నారు. తాజాగా  ఆయన హైదరాబాద్ నగరంలో మూడురోజులుగా పర్యటిస్తున్నారు. నియో సైన్స్ హబ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రిక, స్మార్ట్ లాబ్ టెక్ ఏర్పాటు చేసిన ప్రెస్ ఇంటరాక్టివ్ సెషన్ లో సుతను గురు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలు మృగ్యం, ప్రభుత్వోద్యోగాల ఊసే లేదు, జీవన స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయని సుతను గురు అంటున్నారు.

కానీ ఈ బాధలన్నీ అనుభవిస్తున్న సగటు ఓటరు మాత్రం మళ్లీ నరేంద్ర మోదీకే మొగ్గు చూపొచ్చని కూడా సుతను గురు  అన్నారు. దానికి కారణం, ప్రతిపక్షాల మీద ఏ మాత్రం నమ్మకం లేకపోవడమే అని సుతను గురు అభిప్రాయపడ్డారు. తాను చేస్తున్న ఇండియా టు భారత్ యాత్ర - రాజకీయాలకు అతీతం కాదన్న సుతను గురు.. రాజకీయనాయకులకు మాత్రం ఎంతో దూరమని ఆయన ఒ ప్రశ్నకి బదులుగా చెప్పారు.

60 రోజుల నుంచి జరుగుతూ, మరో 30 రోజులు సాగనున్న తన యాత్రలో ఏ ఒక్క రాజకీయనాయకుడ్ని కూడా కలవలేదని సుతను గురు స్పష్టం చేశారు. దేశంలోని సామాన్యుడి  ఆలోచనలు తెలుసుకొని, అభిప్రాయాలు పంచుకొని, ఆకాంక్షల్ని అర్థంచేసుకోవడమే తన ఇండియా టు భారత్ యాత్ర అంతరార్థమని సుతను గురు అంటున్నారు. ఏ పార్టీ అవినీతికి అతీతంకాదనే స్పష్టత ప్రజలందరికీ ఉందన్న సుతను గురు.. అసలు అవినీతి అనేది ఎన్నికలలో అంశం కావడం లేదని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: