రష్యా ఆర్మీలో ఇండియన్లు.. మోదీ షాకింగ్‌ నిర్ణయం?

Chakravarthi Kalyan
చాలా మంది భారతీయులు రష్యా సైన్యంలో సహాయకులుగా పని చేయడానికి సంతకాలు చేసి వెళ్లారు. అయితే ఉక్రెయిన్ తో జరగుతున్న యుద్ధంలో తమను కూడా పాల్గొనవలిసిందిగా ఆర్మీ వారు ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవల కొన్ని వీడియో సందేశాలు భారత్ కు చేరాయి. తమను రక్షించవల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలు అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలో మాస్కోలోని అధికారులతో మన విదేశాంగ శాఖ చర్చలు జరిపింది.

దీంతో రష్యా సైన్యంలో సహాయకులుగా పనిచేస్తున్న భారతీయ సిబ్బందిని భారత్ అభ్యర్థన మేరకు విడుదల చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యన్ సైన్యంలో ఉన్న భారతీయులకు సంబంధించిన అన్ని కేసులను పరిష్కరించడానికి రష్యా అంగీకరించినట్లు వివరించింది. రష్యన్ సైన్యంతో ఉన్న భారతీయులు సహాయం కోరుతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు సరికాదు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపట్టాం.

వీటిని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీని ఫలితంగా కొంతమంది భారతీయులు విడుదల అయ్యారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే కొన్ని వార్తా పత్రికలు ఉక్రెయిన్ దళాలతో భారతీయ పౌరులు పోరాడతున్నారని ప్రచురించాయి. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ రష్యా- ఉక్రెయిన్ వివాదంలో చిక్కుకోవద్దంటూ గతవారం భారత పౌరులకు సూచించింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది.

అయితే రష్యా ఆర్మీలో ఎంత మంది పనిచేస్తున్నారనే విషయం తెలియరాలేదు. ఎంతమందిని విడుదల చేశారు అనేది కూడా చెప్పలేదు. రష్యా సైన్యంలో సుమారు వంద మంది ఇండియన్స్ ఉండొచ్చని పలు నివేదికలు తెలిపాయి. కాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఈ నెల 24న మూడో ఏడాదిలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ చొరవ తోనే  మన సైన్యాన్ని రష్యా వెనక్కిపంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: