జగన్ రాజకీయ అంతమే.. షర్మిల పంతమా?

Chakravarthi Kalyan
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిళ  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎంతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆమె సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఆస్తుల్లో వాటా ఇవ్వనందువల్ల వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరారని విమర్శించే వారు ఉన్నారు. మరి ఇప్పుడు ఆమె లక్ష్యం ఏమిటి? అన్న ఇవ్వను అన్న ఆస్తులను చేజిక్కించుకోవడమా లేక కాంగ్రెస్ ఓటు బ్యాంకు సంపాదించి పెట్టడమా లేక జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడమా అనేది తేలడం లేదు.

ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైఎస్ షర్మిళ తర మొదటి టార్గెట్ డిసైడ్ చేసుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీట్లు గెలుచుకోపోయినా.. ప్రభావవంతమైన పార్టీగా గుర్తించేలా ఓటు బ్యాంకే లక్ష్యంగా ఆమె  పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించే ముస్లిం, దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు షర్మిళ తన మొదటి స్పీచ్ లోనే ప్రయత్నాలు చేశారు.

టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీకి దగ్గరని చెప్పడమే కాకుండా మణిపుర్ చర్చిల అంశంపై మాట్లాడి సీఎం జగన్ ను ఇరకాటంలో పడేశారు.  దీంతో పాటు జగన్ వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడుతున్నారు. తద్వారా వైసీపీ అధినేతను రాజకీయంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.  ఈమెకు ఎల్లో మీడియా తోడైంది.

గతంలో ఎన్టీఆర్ కుటుంబంలో కలహాలు జరిగనప్పుడు ఈ రేంజ్ లో ప్రచారం లభించలేదు. పైగా  రాజకీయ వారసత్వం ఆయన కుమారులకు కాకుండా అల్లుడు అయిన చంద్రబాబు దక్కించుకున్నారు. దీంతో అప్పుడు నందమూరి హరికృష్ణ పార్టీ పెట్టిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం షర్మిళ తన అన్న తనకు అన్యాయం చేశారనే విషయాన్ని చెబుతూ వస్తోంది. దీనిని ఎల్లో మీడియా హైలెట్ చూసి చూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇవి మరింత తీవ్ర స్థాయికి  వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా జగన్ ను రాజకీయంగా అంతం చేసే కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: