టీడీపీ-జనసేన మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందా?

Chakravarthi Kalyan
త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు పలుమార్లు భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో పై చర్చించారు. అయితే ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సొంత ఛానల్ సాక్షిలో జనసేనకు కేటాయించే 68 స్థానాలు ఇవే అంటూ వార్త రాసుకొచ్చింది.

మరోవైపు వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా జనసేనకు కేటాయించే స్థానాలు ఇవే అంటూ ఒక లిస్ట్ ను ప్రచారం చేస్తోంది. అందులో ఏముంది అంటే టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తులో భాగంగా టీడీపీ 112, జనసేన 63 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ఇది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు పేరుతో లెటర్ హెడ్ తో ప్రకటన జారీ అయినట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మరోవైపు బీజేపీ కోసం ఈ నెలాఖరు వరకు వేచి చూద్దామని  ఆపార్టీతో పొత్తుపై స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని ఇరు పార్టీల అధినేతలు ఓ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది నకిలీ ప్రకటన అని దీనిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ కోరింది.

కాగా ఇదంతా వైసీపీ ట్రాప్ గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ 68 అడగలేదు అని ప్రకటిస్తే మరి ఎన్ని సీట్లు ఇస్తారు అని ప్రశ్నిస్తారు. పొత్తు లేట్ అయ్యే కొద్దీ కార్యకర్తల్లో గందరగోళం ఉండటం సహజమే. దానిని అవకాశంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ రేపు జనసేనకు 25-30 సీట్లు ఇస్తే పవన్ కల్యాణ్ కి అన్యాయం చేశారు.. కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం చేస్తారు. టీడీపీ, జనసేనల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: