భారత్‌కి శుభవార్త: అండమాన్‌లో అద్భుత నిధులు?

Chakravarthi Kalyan
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా భారత్ ఓ విషయంలో ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆ విషయమే చమురు నిల్వలు. మనం చమురు దిగుమతులపై చాలా దేశాలపై ఆధారపడుతూ ఉంటాం. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.  రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నాయని ఆ దేశం నుంచి ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నాం.

ఎన్నో సహజ వనరులకు కేంద్రమైన భారత్ లో చమురు నిల్వలు లేవా.. అనే ప్రశ్న ప్రతి భారతీయుడిలో కలగక మానదు. ఇప్పటి వరకు భారత్ లో ఉన్న చమురు నిల్వలను గుర్తించి వెలికితీసే ప్రయత్నాలను ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. అయితే తాజాగా చమురు నిల్వలపై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం రెండేళ్లుగా వాటి అన్వేషణపై ప్రత్యేక కార్యచరణను ప్రారంభించింది. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చమురు నిల్వలు తెలుసుకునేందుకు భారీ ప్రాజెక్టులను  చేపట్టింది.

ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ లో చమురు నిల్వలు ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది అరబ్ దేశాలకు షాకింగ్ న్యూసే. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తినా ఆ ప్రభావం చమురు ఎగుమతులపై పడుతుంది. ఫలితం ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ అంశం భారత్ పై పెను ప్రభావం చూపుతుంది. ఇక మీదట ఇలాంటి ఆందోళనకు తెరపడే అవకాశాలు ఉన్నాయి.

అండమాన్ లో సుమారు 70 ఏళ్లకు సరిపోయే చమురు నిల్వలు 120 బిలియన్ బేరళ్ల ఆయిల్ ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించిందని సమాచారం. ఇదే నిజం అయితే భారత్ కు అతి పెద్ద ఉమశమనం అనే చెప్పవచ్చు. భారత్ దిగుమతి చేసుకునే దాంట్లో సింహభాగం క్రూడాయలే అని మనందరికీ తెలిసిందే. మరో రెండు నెలల్లో అండమాన్ లో క్రూడాయల్, గ్యాస్ ను వెలికితీసే పనిలో ఓఎన్జీసీ నిమగ్నమైందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: