బిగ్‌ట్విస్ట్: బీజేపీ- టీడీపీ డీల్ ఓకే అయ్యిందా?
మరోవైపు జనసేనతో పొత్తు ప్రశాంత్ కిశోర్ తో వ్యూహాలు, మెజార్టీ మీడియా మద్దతు ఇవన్నీ ఉన్నా చంద్రబాబు బీజేపీ తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. బీజేపీ కూడా దక్షిణాదిపై పట్టు కోసం చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. అధికారం పంచుకున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కూటమి మూడు ముక్కలు అయింది. 2019 ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. దీంతో మళ్లీ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన ముందుకొస్తుంది.
ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం కూటమి కట్టే విషయంలో రాష్ట్ర నాయకులు అభిప్రాయాలను కోరింది. 2014 తరహా ప్రతిపాదన చర్చకు వచ్చింది. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన కూడా టీడీపీతో కలిసే ఉందని..చంద్రబాబు కూడా బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర నేతలు అగ్ర నాయకత్వానికి నివేదించారు.
మరోవైపు బీజేపీకి 5-6 లోక్ సభ సీట్లు, 10-12 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. లోక్ సభ లో దృష్టి సారించాలని చూస్తున్న కేంద్రం 10 వరకు ఎంపీ సీట్లను ఆశిస్తోందని సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు టీడీపీతో కలిసి వెళ్దామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని నమ్ముకున్నకొంతమంది టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు అంట. ఏది ఏమైనా జనవరి తొలి వారం కానీ.. సంక్రాంతి తర్వాత పొత్తుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.