జాతీయ పార్టీలు చంద్రబాబును పట్టించుకోవట్లేదా?
మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదేవిధంగా మూడు పార్టీలు కలిసి జట్టు కట్టాయి. అంటే వాళ్ళు విడిగా పోటీ చేసినా కూడా మమతా బెనర్జీ వెనకే ఉన్నారు ఆ ఎన్నికల్లో. దాంతో ఆ సందర్భంలో మమతా బెనర్జీ 200సీట్లు వరకూ సాధించింది. అందుకోసమే ఇప్పుడు తిరిగి మమతా బెనర్జీ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టు పార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ తిరిగి సంయుక్తంగా ఈ మీటింగ్ నిర్వహించినట్టు తెలుస్తుంది.
ఈ ప్రణాళిక ద్వారా చివరికి భారతీయ జనతా పార్టీని ఓడించడం అనేది వారి ప్రధాన అజెండాగా తెలుస్తుంది. అయితే మమతా బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఆవిడను ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేంటంటే జరగబోయే మీటింగ్ కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాగే బి ఎస్ ఆర్ పార్టీలను పిలుస్తున్నారా అని.
దానికి మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ ఒకరికి కేంద్ర దర్యాప్తు సంస్థతో సమస్య ఉంది. మరొకరికి ప్రాంతీయ సమస్య ఉంది. అందుకని నేను ఎటువంటి కామెంట్స్ చేయను, ఐ ఎన్ డి ఐ ఏ కూటమి బలపడితే అందరూ వచ్చి చేరతారని అన్నారట. కానీ అసలు మీడియా వాళ్ళు నిజాయితీగా అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలుస్తున్నారా అని. ఎందుకంటే ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామి కాబట్టి. ఇంతకీ ఈ మీటింగ్‌కు టీడీపీ హాజరుకానేలేదు. అంటే బాబును వాళ్లు లైట్‌గా తీసుకున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.