జగన్ కఠోర నిర్ణయం.. తగ్గేదే లేదా?

Chakravarthi Kalyan
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండే  సన్నాహాలు  చేసుకుంటుంది. దానిలో భాగంగానే పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోబోతుంది అని తెలుస్తుంది. దాని ప్రకారం తమ పార్టీలోకి కొత్త ముఖాలను  తీసుకుని వచ్చే ఆలోచనలో ఉందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తమ పార్టీలోని 35 మందిని మందికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట జగన్మోహన్ రెడ్డి.

దీనికి  మొన్న బాలినేని చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆనం రామకృష్ణారెడ్డి రాజీనామా ఊతమిస్తున్నాయి. అయినా కొత్త ముఖాలను తీసుకోవడం వల్ల చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయింది. వాళ్ళు లేకపోవడం వల్లే తెలంగాణలో మైనస్ కూడా అయింది. మొన్నటి వరకు  తమకు సీట్లు ఖాయం అని అనుకున్న లీడర్లు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నారట.

పార్టీకి పరమ విధేయుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు కూడా మారడానికి జగన్ యొక్క ఈ నిర్ణయమే కారణమని అంటున్నారు. ఇంకా బాలినేని నాని లాంటి వాళ్లు పార్టీకి విధేయంగా ఉండి తర్వాత ఏదైనా పదవులు సంపాదించుకుంటారా లేదా అన్నది వాళ్ళ తీరుపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రి పదవి మాత్రం దక్కలేదు .

అయితే వీళ్ళందరూ అసంతృప్తితో తెలుగుదేశం పార్టీ టికెట్ లో, జనసేన పార్టీ టిక్కెట్లో లేదా భారతీయ జనతా పార్టీ టిక్కెట్లో సంపాదిస్తారా అనేది వేచి చూడాలి. కానీ వాళ్లు ఏదోరకంగా ఏదో ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలవాలని మాత్రమే  అనుకుంటూ ఉంటారు. ఒకరకంగా జగన్ వల్ల హర్ట్ అవుతున్న ఎమ్మెల్యేలు అందరూ వేరే వేరే పార్టీలోకి వెళ్ళైనా సరే తిరిగి తమ పదవులు కాపాడుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ సందర్భంలో జగన్ తిరిగి తన నిర్ణయం మార్చుకుంటారా అంటే ఖచ్చితంగా మార్చుకోరు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: