వందల కోట్లు.. ఉచితంగా ఇచ్చేస్తారు?

Chakravarthi Kalyan
దానం అనగానే వెంటనే అందరికీ కర్ణుడు గుర్తుకు వస్తాడు. దాన గుణంలో అతని తర్వాతే ఎవరైనా అని అభివర్ణిస్తుంటారు. సంపదను పోగేయడం.. అంతకంతకూ పెంచడమే తప్పించి.. చుట్టూ ఉన్న వారికి తిరిగి ఇచ్చే విషయంలో అందరికీ పెద్ద మనసు ఉండదు. అందరికీ భిన్నంగా కొందరు మాత్రం తాము సంపాదించే సంపదను నలుగురికి పంచి పెట్టేందుకు ఆసక్తి చూపడమే కాదు.. అంతకంతకూ తమ దాన గుణాన్ని పెంచుకుంటూ పోతుంటారు.

తాజాగా తమ సంపదను పంచే దానగుణం ఉన్న వారికి సంబంధించిన వివరాల్ని తాజాగా విడుదైలన ఓ నివేదిక వెల్లడించింది. మన సంపదను కార్పొరేట్లు దోచుకు తింటున్నారని రోజూ మనం ఆరోపించే వాళ్లే అత్యధికంగా దానాలు చేస్తూ తమ ఔదార్యం దాటుతున్నారు. ఈ వరుసలో అందరికంటే ముందు ఉంది హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్.  రోజుకు ఆయన రూ.5.5 కోట్లు దానంగా ఇస్తున్నారు. ఏడాది కాలంలో ఆయన రూ.2042 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. గతంలో ఆయన రూ.1161 కోట్లు ఇవ్వగా ఈ సారి అంతకుమించి విరాళాలు ఇచ్చారు.

ఈ జాబితాలో విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఏడాది కాలంలో రూ.1774 కోట్లను విరాళంగా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే ఈసారి 267 శాతం అధికంగా విరాళం ఇచ్చారు. తర్వాతి మూడో స్థానం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన రూ.376 కోట్లు విరాళంగా ఇస్తున్నారు. గౌతమ్ అదానీ విషయానికొస్తే గతేడాది ఏడో స్థానంలో ఉన్న ఆయన ఈసారి ఐదోస్థానానికి ఎగబాకారు.

వీరంతా ఆయా విరాళాలను విద్య, వైద్య రంగాలకు ఖర్చు పెడుతున్నారు. ఈ సంస్థలన్నింటి దగ్గర ప్రభుత్వమే విరాళాలు సేకరించి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్య రంగానికి ఖర్చు పెడితే భారత దేశం కాస్తయినా బాగుపడుతుంది. అలా జరగాలని ఆశిద్దాం. సంపద పెంచడమే కాదు.. పంచడమూ తెలిసిన వాళ్లు వీళ్లు. గ్రేట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: