లోకేశ్‌ను బతిమాలి పిలిపించుకున్న అమిత్‌షా?
అయితే లోకేశ్ ఢిల్లీ వెళ్లి చంద్రబాబుపై పెట్టిన కేసులు, ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు రీత్యా ఆయన పడుతున్న ఇబ్బందులు తదితర వివరాలను అమిత్ షా కు వివరించారు. ఇది ఆయనే మీడియా పరంగా చెప్పారు. ఇలా జరుగుతున్న సమస్య చంద్రబాబు జైలుకు వెళ్లిన కేసు వివరాలను కూడా ఆయన అమిత్ షాకు వివరించారు. అయితే ఎకో సిస్టం విధానం వల్ల లోకేశ్ నే అమిత్ షా కలవాలనే విధంగా ప్రచారం చేయడం టీడీపీ వారికే చెల్లింది.
అమిత్ షా ఎందుకు లోకేశ్ ను పిలుస్తారు. ఆయనతో బీజేపీకి ఏం అవసరం ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఆయన కేసు వివరాలు చెప్పి ఏదైనా సాయం చేయాలని లేదా మద్దతు కావాలని అడిగేందుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. కేవలం అమిత్ షానే కాదు కేంద్రంలోని చాలా మంది పెద్దలను కలిసి వారికి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని వివరించారు.
అంతే గానీ ఇక్కడ ఉండే లోకల్ మీడియా తదితరులు చేస్తున్న కార్యక్రమాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. అసలు ఇప్పటికే బాబు అరెస్టు వల్ల టీడీపీ ఇక్కట్లో ఉంటే అమిత్ షానే లోకేశ్ ను కలవాలని అన్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రతిష్ట దిగజార్చుకుంటున్నారు.