మళ్లీ సీన్‌లోకి నిమ్మగడ్డ.. ఏంటి కథ?
తీరా చూస్తే మిగతా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుని సక్సెస్ అయ్యారు. దీంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని బహిరంగంగా అందరూ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా కరోనా వంక పెట్టి ఎలక్షన్లను ఆపి టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. తెలుగు దేశం పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి అని పేరు పెట్టారు. దానికి అయిదింతలు ఎక్కువగా రాశారు. అయితే నిమ్మగడ్డను చాలా వరకు కాపాడిన ఎల్లో మీడియా ప్రజల్లో ఆయన పట్ల సానుకూలతను మాత్రం తీసుకురాలేకపోయింది.
టీడీపీ అనుకూల వ్యక్తిగా ప్రజల్లోకి నిమ్మగడ్డ పేరు వెళ్లిపోయింది. వైసీపీ అధినేత జగన్ తో గతంలో కలిసి వెళ్లిన కొంతమంది.. జగన్ అంటే అసహ్యించుకునే కొందరు యాంటీ వైసీపీ ఫోరం బయటకు వచ్చింది. అయితే ఇందులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉండడం.. ప్రభుత్వం పాడైపోయింది. సరిగా పట్టించుకోవడం లేదు. అని మాట్లాడారు. దీంతో వైసీపీ నాయకులు నిమ్మగడ్డకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చినా కూడా జయప్రకాశ్ నారాయణన్ ఎక్కడా కూడా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోలేదు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.