జగన్.. అనవసరంగా బాబుతో పెట్టుకున్నారా?
అయితే జగన్ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించి చాలా తప్పు పని చేశాడని కొంత మంది అంటున్న మాట. అయితే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన తర్వాత జరగబోయే పరిణామాలను ముందుగా అంచనా వేయకుండా జగన్ ఈ పని చేయడు. అలాగే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఉన్న విషయం కూడా జగన్ కు తెలియనిది ఏమీ కాదు. చంద్రబాబు కు ఉన్న మద్దతు గురించి జగన్ కు తెలియనిది ఏమీ కాదు.
అలాగే జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి చెప్పకుండా ఈ అరెస్టు అయితే చేయించరు. అయితే చాలామంది అనే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే కేంద్రం ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించారని అనుకుంటున్నారు. అయితే జగన్ అరెస్ట్ కు ముందు కేంద్రానికి ఒక మాట అయితే చెప్పుంటారు. అంతేగాని కేంద్రం ఏమి తెలుగుదేశం పార్టీపై ప్రత్యేకమైన పగ లాంటిది కలిగి ఉండదు అంటున్నారు. అలా చూస్తే ఏ పార్టీ పైనా ఏ విధమైన అభిప్రాయం ఉండవు కేంద్రానికి.
ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటే వాళ్లని ఆపకుండా ఎవరి సత్తా ఎంత ఉందో చూసి వాళ్లలో నెగ్గినవాడి వాడికి సపోర్ట్ చేస్తుంది కేంద్రం. మామూలుగా ఎవరైనా ఎలక్షన్లు దగ్గర పడే ఈ సమయంలో ఇలాంటి ఒక బలమైన స్టెప్పు తీసుకుంటారా? అది కూడా ఇలా చేస్తే తాను నెగ్గనేమో అనుకున్న సందర్భంలో ఎలా చేస్తారు అనుకుంటున్నారు.