సంచలన ప్రకటన విడుదల చేసిన రామోజీరావు?

Chakravarthi Kalyan
తమ మార్గదర్శి సంస్థపై ఏపీ సీఐడీ చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు. మార్గదర్శి పేరుతో విడుదలైన ఈ ప్రెస్‌నోట్‌లో.. చిట్ ఫండ్స్ చట్టం, 1982, ఆదాయపు పన్ను చట్టంలో వర్తించే అన్ని ఇతర చట్టాలతో సహా చిట్ ఫండ్ వ్యాపారాన్ని నియంత్రించే నియమాలు మరియు నిబంధనలను మార్గదర్శి ఎక్కడా ఉల్లంఘించలేదని... అంతేకాదు మార్గదర్శి ఏ విధమైన ఉల్లంఘన పాల్పడలేదని మేము మా చందాదారులకు మరోసారి గట్టిగా హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు.


ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడా ఉల్లంఘించలేదని మా చందాదారులందరికీ మార్గదర్శి హామీ ఇస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా కంపెనీ తన వ్యాపారాన్ని చాలా నిబద్దతతో నిర్వహిస్తోందన్న మార్గదర్శి సంస్థ... మా ఆర్థిక క్రమశిక్షణే మా బలం, మేము ఎప్పుడైనా ఏ విషయంలోనూ చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించ లేదని స్పష్టం చేసింది.


చిట్‌ ఫండ్ కంపెనీలో సభ్యునిగా నిర్ధారణ అయ్యాక కూడా మా చందాదారులందరినీ భయాందోళనలకు గురిచేయడానికి ఏపీ సీఐడీ ప్రయత్నిస్తోందని.. వారి వ్యక్తిగత వివరాల కోసం పట్టుబట్టి వేధించడానికి, మార్గదర్శి వ్యాపారాన్ని దాని కస్టమర్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసే దురుద్దేశాలతో విచారణలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది.  కంపెనీలో చందాదారునిగా ధృవీకరించిన తర్వాత కూడా గౌరవనీయ తెలంగాణ హైకోర్టు రిట్ పిటీషన్ WP 45189/2022లో జారీ చేసిన ఉత్తర్వులో చందాదారుల గోప్యతలో జోక్యం చేసుకోకూడదని సీఐడీకి సూచించిందని గుర్తు చేసింది.


కానీ తమ చందాదారుల గోప్యత విషయంలో కోర్టు వారి నిర్లక్ష్యపెట్టిన ఏపీ సీఐడీ  కోర్టు దిక్కారానికి పాల్పడిందని మార్గదర్శి అంటోంది.  ఈ విషయంలో గౌరవనీయ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పదే పదే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తోందని.. తన కస్టమర్లందరినీ వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: