రష్యా ఎన్నికలపై అమెరికా కుట్ర పన్నుతోందా?

Chakravarthi Kalyan
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు కాకుండా ఉండాలనేది రష్యా భావించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపు గెలవాలని రష్యా అధ్యక్షడు పుతిన్ సహకరించారని అమెరికా నిఘా సంస్థలతో పాటు బైడెన్ వర్గం ఆరోపించింది. ఇలా రష్యా అమెరికా ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్నా ట్రంపును గెలిపించే ప్రయత్నాలు చేయడం, సోషల్ మీడియాలో, మెయిల్స్ లో బయటపడ్డాయి. దీని వల్ల తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

2024 లో రష్యా లో ఎన్నికలు జరగనున్నాయి. పుతిన్ వ్యతిరేక వర్గం అయిన ప్రతిపక్ష నేతను ఇప్పటికే జైలులో బందీ చేశారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ ఎన్నికలు అసలు ఏకపక్షంగా జరగకుండా అమెరికా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తున్నట్లు తెలుస్తోంది.

రష్యా అమెరికాకు సహకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ట్రంపు వర్గం వ్యతిరేకించింది.  ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాలో కూడా దాదాపు 30 శాతం పుతిన్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు వారందరి ఓట్లను ప్రతిపక్ష నేతలకు పడేట్లు చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా పుతిన్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లతో పాటు ఆయనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించాలని అమెరికా  ప్రయత్నిస్తుంది.

రష్యా లో పుతిన్ ఓడిపోవడానికి అమెరికాలోని సోరెస్ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. సోరెస్ సంస్థ సోషల్ మీడియాతో పాటు వివిధ రకాలుగా వ్యతిరేక వార్తలు రాయడం మొదలు పెట్టాయి. అయితే దీనిపై రష్యా విదేశాంగ మంత్రి సర్గొస్ ఇలాంటి విధానాలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన చర్యలు అలాంటి సంస్థలపై తప్పకుండా తీసుకుంటామని అన్నారు. సోరెస్ సంస్థ గతంలో ఇండియాలో అదానీ గురించి వ్యతిరేక వార్తలు రాసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి రష్యా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: