దేవుడు ఎక్కడో కాదు మనిషిలోనే ఉన్నాడు.. ఇదే ప్రూఫ్.. చూడండి?

praveen
సాదరణంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. తాము కష్ట కాలంలో ఉన్న సమయంలో తమను రక్షించాలి అంటూ గుడికి వెళ్ళిన ప్రతిసారి వేడుకుంటూ ఉంటారు. అయితే హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై ప్రార్థిస్తూ ఉంటారు. తమకు కష్టాలు రాకుండా చూడాలని.. ఒకవేళ కష్టాలు వస్తే తమకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా మనుషులకు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు ఏకంగా ఆకాశం నుంచి దిగిరాడని.. పక్కన ఉన్న మనుషుల్లోనే దేవుడు ఉంటాడు అని ఎంతోమంది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.

 మనిషి కష్ట కాలంలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి సహాయం చేసిన వాడే నిజమైన దేవుడు. దేవుడు స్వయంగా దిగిరాడు. ఇలా కష్ట కాలంలో ఉన్నప్పుడు కాపాడటానికి మనిషి రూపంలోనే అక్కడికి వస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇది ముమ్మాటికి నిజమే అని నిరూపించే ఘటనలు ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా ప్రాణాలు పోయాయి అని ఓ మహిళ అనుకుంటున్న సమయంలో రెప్పపాటు కాలంలో మనిషి రూపంలో చేరుకున్న దేవుడు చివరికి ప్రాణాలు కాపాడగలిగాడు..

 ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులోకి ఎక్కడం ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఇలాంటి సాహసం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఉడిపి రైల్వే స్టేషన్లో ఒక మహిళ రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ ప్లాట్ ఫామ్ పై పడిపోయింది. అయితే కొన్ని సెకండ్లు ఆలస్యమైనా ఆమె రైలు కింద పడిపోయేది. కానీ అక్కడే ఉన్న ఆర్పిఎఫ్ మహిళా కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమైంది. సదరు మహిళను పక్కకు లాగింది. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడగలనుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. దేవుడు ఎక్కడో లేడు సాటి మనిషిలోనే ఉన్నాడు అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: