జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్.. డ్రోన్ ఫుటేజ్ వైరల్?

praveen
" data-original-embed="" >
పాకిస్తాన్, ఇండియా సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా రెండు దేశాల సరిహద్దులు ఎప్పుడో ఒకసారి మాత్రమే టెన్షన్ వాతావరణం నెలకొంటుంది   ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుందేమో అనిపించేలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం ఎప్పుడూ యుద్ధ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది.

 పాకిస్తాన్ సరిహద్దుల నుండి ఎంతోమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఇక కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కాశ్మీర్ ప్రాంతంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇలా ఉగ్రవాదుల ఆటలు సాగలేదు.  కానీ గత కొంతకాలం మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.. భారత్ లోకి చొరబడి కాల్పులకు తెగ పడుతూ ఉండటం చూస్తున్నాం. సైనికుల అప్రమత్తమై ఉగ్ర కార్యకలాపాలపై నిఘా  ఏర్పాటు చేస్తూ.. వరుస ఎన్కౌంటర్లు చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్న వేల.. ఉగ్రవాద కార్యకర్తలపై భద్రతా బలగాలు మరింత పటిష్టమైన నిఘానూ ఏర్పాటు చేశారు. ఇక ఇటీవల ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది  ఏకంగా ముగ్గురు టెర్రరిస్టులను మట్టుపెట్టాయి భారత బలగాలు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బారాముల్లాలోని ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారు అన్న సమాచారంతో భారత బలగాలు అక్కడికి వెళ్లాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భారత బలగాలు  అప్రమత్తమై వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ఏకంగా ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: