ఆ బాలికకు కళ్ళు లేవు.. అయినా ఆ కామాంధుడు ఊరుకోలేదు.. చివరికి?
ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. అయితే కామాంధులను శిక్షించేందుకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చిన ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఆడపిల్లల రక్షణను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మలక్ పేటలోని ప్రభుత్వ అంద బాలికల వసతి గృహ పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై మరుగుదొడ్లను శుభ్రపరిచే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలిక ఆస్మాన్ ఘాట్ లోని ప్రభుత్వ అంద బాలికల వసతి గృహంలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఈ నెల ఏడవ తేదీన బాలికకు రక్తస్రావం కావడంతో హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించాడు. అయితే బాధితురాలని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగింది అన్న విషయాన్ని నిర్ధారించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఇదే విషయంపై మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలితో పాటు ఆమె ముగ్గురు స్నేహితులను కూడా మలక్ పేట పోలీసులు విచారించగా మెహదీపట్నం కు చెందిన నరేష్ వసతి గృహంలో బాత్రూంలో మరుగుదొడ్లు శుభ్రపరుస్తుంటాడని అతడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.