కొడుకు కాదు కిరాతకుడు.. ఆ మాట అన్నందుకు.. తల్లీ, తమ్ముడిని చంపేసాడు?

praveen
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల బాగు కోరుకుంటూ ఉంటారు. ఏకంగా మంచి చదువులు చదవాలని సన్మార్గంలో నడవాలని అనుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు పెడదోవ పడుతున్నారు అని తెలిస్తే కాస్త మందలించి ఇక సరైన దారిలో నడిచేలా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎప్పటికప్పుడు మంచి చెడులను తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూనే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం  పిల్లలు ఏకంగా తల్లిదండ్రులు మందలించారు అన్న కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏకంగా తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక్కడ ఇలాంటి ఒక కిరాతకమైన కొడుకు గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

 సాదరణంగా పిల్లలు బాగా చదవకపోతే బాగా చదువుకోవాలని.. లేదంటే జీవితం పాడవుతుందని ఏ తల్లిదండ్రులైన పిల్లలకు చెబుతూ ఉంటారు. కానీ ఇలా చెప్పడమే ఏకంగా ఆ తల్లి పాలిట శాపంగా మారిపోయింది. ఏకంగా కాలేజీ కోర్సు పూర్తి చేయమని చెప్పినందుకు ఓ కొడుకు కిరాతకుడిగా మారిపోయాడు. కన్న తల్లిని ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని దారుణంగా చంపేసాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. తిరువత్తూరులోని తిరునగర్ ఒకటవ వీదికి చెందిన 45 ఏళ్ల పద్మకు నితీష్ (20) సంజయ్ (14) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 అయితే నితీష్ చెడు అలవాట్లకు బానిసగా మారడం మొదలు పెట్టాడు. దీంతో చదువును కంప్లీట్ చేయమని తల్లి అతనిపై ఒత్తిడి చేసింది. దీంతో కోపంతొ ఊగిపోయిన నితీష్.. ఏకంగా అతడితోపాటు తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరి మృతదేహాలను బ్యాగులో కుక్కి బంధువులకు ఫోన్లో సమాచారం అందించాడు. బంధువులకు పంపిన మెసేజ్ లో తల్లిని తమ్మున్ని తానే చంపేసినట్టు పేర్కొన్నాడు. అనంతరం నితీష్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే బంధువులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని నితీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల ఓ బీచ్ లో తిరుగుతుండగా అతన్ని పట్టుకుని స్టేషన్కు తరలించి విచరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: