అత్త ఇన్సూరెన్స్ పై కన్నేసిన కోడలు.. చివరికి ఓ రోజు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా సమస్య వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవాడు మనిషి. అయితే ఇలాంటి జాలి దయ గుణం ఉంది కాబట్టే ఈ భూమ్మీద ఉండే అన్ని జీవులలోకెల్లా మనిషి అనే జీవి ఎంతో ప్రత్యేకమైన చెబుతూ ఉంటారు.

 కానీ ఇటీవల కాలంలో మానవత్వం అనే మాటనే మరిచిపోతున్న మనిషి ఇక అడవుల్లో ఉండే జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. వెరసి చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సొంతవాళ్లే ఇలా చేస్తే ఇంకా ఎవరిని నమ్మాలి అనే అయోమయంలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ వెలుగులోకి వచ్చింది ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.

 ఆమెకు డబ్బుపై ఆశ కలిగింది. దీంతో ఎలా డబ్బు సంపాదించాల అని ఆలోచిస్తూ ఉంటే.. ఒక నీచమైన ఆలోచన తట్టింది. తన అత్తపై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను నొక్కేయాలని అనుకుంది. చివరికి హత్య చేసేందుకు కూడా సిద్ధమైంది. హైదరాబాదులోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు వెలుగు చూసింది. స్థానిక కట్టెల మండి సమీపంలో నివాసం ఉండే గంగ ఆమె కొడుకు రామేశ్వరం పై కోడలు తన బంధువులతో కలిసి దాడి చేయించింది. అత్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని.. ఈ ఘాతుకానికి పాల్పడింది. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. బాధితులను ఆసుపత్రికి తరలించారు  సీసీటీవీ ఫుటిజి ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: