ఆపరేషన్ మధ్యలో ఆపేసి.. దోశ తినేందుకు వెళ్లిన డాక్టర్.. చివరికి?

praveen
నేటి రోజుల్లో కనిపించే కలియుగ దైవం ఎవరు అంటే డాక్టర్లే అని చెప్పాలి. ఎందుకంటే దేవుడి గుడికి వెళ్లి పూజలు చేసి కోరితే అటు దేవుడైన వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ప్రాణాపాయంతో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ మాత్రం తప్పకుండా పునర్జన్మను ప్రసాదిస్తాడు. కరోనా వైరస్ కాలంలో డాక్టర్ల యొక్క గొప్పతనం ఏంటి అన్న విషయం అందరికీ అర్థమైంది. కంటికి కనిపించని ప్రాణాంతకమైన వైరస్ ఎక్కడ సోకుతుందో అని అందరూ ఇంటిపట్టునే ఉండి భయపడిపోయిన సమయంలో డాక్టర్లు మాత్రం కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టి ఇక సమాజ హితం కోసం నడుం బిగించారు. కోట్లాదిమంది ప్రాణాలను కాపాడగలిగారు.

 ఇలా కరోనా వైరస్ సమయంలో డాక్టర్లు వీరోచితమైన పోరాటం చేసిన తీరు వైద్య వృత్తిపై అందరికీ మరింత గౌరవాన్ని పెంచింది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా డాక్టర్ వృత్తికి కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకంగా ప్రాణాపాయంతో తమ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు వైద్యం చేయాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక డాక్టర్ ఇలాంటిదే చేశాడు. సాధారణంగా డాక్టర్లు సర్జరీ చేసే సమయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 సర్జరీ చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగిన ఏకంగా పేషెంట్ ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అందుకే మరో ఆలోచన లేకుండా కేవలం సర్జరీపైన దృష్టి పెడుతూ ఉంటారు వైద్యులు. కానీ ఇక్కడ ఒక డాక్టర్ మాత్రం ఏకంగా చేస్తున్న సర్జరీని మధ్యలోనే ఆపేసి దోశ తినడానికి వెళ్ళాడు. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్న ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వెలుగులోకి వచ్చింది. చేయి విరిగిన ఒక బాలికకు ఆపరేషన్ చేస్తూ మధ్యలోనే ఆపేశాడు వైద్యుడు. ఎందుకంటే ఆయన గారికి ఆకలేసింది. ఇక మసాలా దోశ తీసుకొస్తానని వెళ్లి.. రెండు గంటల తర్వాత వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. బాలికకు నయం కాకపోగా వేలు వంకర పోయాయి. దీంతో బాలికను వేరే ఆసుపత్రిలో చికిత్స చేయించారు.  బాధిత కుటుంబం సదర్ వైద్యుడు పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: