చేసేదేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. కానీ సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు అందరూ కూడా.. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం సంపాదిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని ఇక ఆయా కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉన్నారు అని చెప్పాలి. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం వచ్చింది అంటే చాలు అంతకంటే తమకు ఇంకేం కావాలి అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మాత్రం కొంతమంది యువకులు చేస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా డబ్బు మీద ఆశతో మరో నీచమైన పని చేశారు.

 ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇక హైదరాబాద్లో కూడా కొన్ని మ్యాచ్లు జరుగుతున్నాయ్. ఇలా హైదరాబాదులో జరిగే మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు  అభిమానులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. కొంతమందికి టికెట్లు దొరక్క నిరాశ చెందుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసమే ఇక ముందుగా ఎక్కువ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మడం మొదలుపెట్టారు కొంతమంది సాఫ్ట్వేర్లు. ఈ క్రమంలోని హైదరాబాద్లోనే మాదాపూర్ లో ఎస్ ఓ టి పోలీసులు సోదాలు నిర్వహించారు.

 ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క టికెట్ ధర పదివేల రూపాయలు నుంచి 15000 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సన్రైజర్స్ వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరు ఇస్నాపూర్ కు చెందిన మధుబాబు, సైనిక్ పురీకి చెందిన మాథ్యూ రోడ్రిక్స్, గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఉండే నిజాంతన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముఠా వెనుక  ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: