
మహిళ నీచమైన ఆలోచన.. దానికోసం సొంత అన్ననే పెళ్లి చేసుకుంది?
మంచి ఉద్యోగం లేదంటే వ్యాపారం చేస్తున్న వరుడు కావాలని అమ్మాయిలు.. ఎక్కువ కట్నం ఇచ్చేఅమ్మాయిలే కావాలని అబ్బాయిలు తెగ కమర్షియల్ గా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే ఏకంగా పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏకంగా ప్రభుత్వం పెళ్లి చేసుకునే వారికి పథకం కింద ఇచ్చే డబ్బుల కోసం ఏకంగా చేయకూడని పని చేసింది. అప్పటికే పెళ్లయిన వివాహిత ఏకంగా సొంత అన్ననే పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది అని చెప్పాలి. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి 35వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇక ఈ ఆర్థిక సహాయం పైన ఆశపడిన ఒక మహిళ చేయకూడని నీచమైన పని చేసింది. ఏకంగా సొంత సోదరుడనే పెళ్లి చేసుకుంది ఒక వివాహిత. పెళ్లి సమయానికి వరుడుని తెచ్చుకోకపోవడంతో.. మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి జరిగింది. ఇక ఆ తర్వాత ఈ విషయం తెరమీదకి రావడంతో మహారాజ్ గంజ్ అధికారులు షాక్ లో మునిగిపోయారు. ఇక ఈ విషయం గురించి తెలిసి నేటి సభ్య సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.